Kejriwal : కేజ్రీవాల్ కీలక నిర్ణయం..కరోనా బాధిత కుటుంబాలకు రూ. 50వేలు,తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు నెలకు రూ.2500 పెన్షన్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంగళవారం కేజ్రీవాల్ ప్రకటించారు.

Kejriwal : కేజ్రీవాల్ కీలక నిర్ణయం..కరోనా బాధిత కుటుంబాలకు రూ. 50వేలు,తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు నెలకు రూ.2500 పెన్షన్

Kejriwal

Kejriwal ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంగళవారం కేజ్రీవాల్ ప్రకటించారు. అదేవిధంగా ఇంట్లో సంపాదించే వ్యక్తి కరోనాతో మరణిస్తే ఆ కుటుంబానికి అదనంగా నెలకు రూ.2500 పింఛను ఇవ్వనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. భర్త చనిపోతే..భార్యకు పెన్షన్,భార్య చనిపోతే భర్తకు పెన్షన్,పెళ్లి కాని వ్యక్తులు చనిపోతే వారి కుటుంబసభ్యులకు ఆ పెన్షన్ అందించనున్నట్లు కేజ్రీవాల్ ఓ ప్రకటనలో తలిపారు.

అదేవిధంగా,కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు కూడా ఢిల్లీ ప్రభుత్వం ముందుకొచ్చింది. కరోనా కారణంగా తల్లిదండ్రులు/సింగిల్ పేరెంట్ మరణించిన సందర్భంలో పిల్లలకు 25 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి నెలా రూ.2500 పెన్షన్ ఇవ్వనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. వారి చదువులకు అయ్యే ఖర్చును పూర్తిగా ఢిల్లీ ప్రభుత్వం భరిస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. ఇక, ఢిల్లీలోని 72 లక్షల మంది నిరుపేదలకు.. నెలకు 10 కిలోల ఆహార పదార్థాలు ఉచితంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రేషన్ కార్డు లేని పేదలకూ ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రకటించిన నిర్ణయాలన్నీ కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే అమలు చేయనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.

కాగా, కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోతున్నారు. వారికి నేనో విషయం చెప్పాలనుకుంటున్నా. మీరు అనాథలని బాధపడకండి. మీకు నేనున్నాను. అనాథలైన పిల్లల చదువులు, భవిష్యత్తును ప్రభుత్వమే చూసుకుంటుంది. పిల్లలను కోల్పోయిన వృద్ధ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇన్నాళ్లూ వారు పిల్లలపైనే ఆధారపడ్డారు. అలాంటి వారికి పెద్ద కొడుకు(కేజ్రీవాల్‌) ఇంకా బతికే ఉన్నాడు. అలాంటి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తుంది. ఈ వయసులో ఆ పెద్దవాళ్లకు ఆర్థిక అండతో పాటు ఆదరణ, అభిమానం కూడా కావాలి అని గత వారం కేజ్రీవాల్ చెప్పిన విషయం తెలిసిందే.

మరోవైపు,మధ్యప్రదేశ్​లోనూ..కరోనాతో అనాథలైన చిన్నారులను ఆదుకోవడం కోసం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కూడా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అలాంటి పిల్లలకు నెలకు రూ. 5వేల పింఛనుతో పాటు ఉచిత విద్యను అందించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇక,ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పేరు మీద రూ.10లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.