Covid Cases : ఊపిరిపీల్చుకుంటున్న ఢిల్లీ, ఎలా సాధ్యమైంది ?

వేలల్లో కేసులు.. వందల్లో మరణాలు, శ్మశానాల వద్ద శవాల క్యూ లైన్లు.. ప్రాణవాయువు లేక గాల్లో కలిసే ఆయువు.. బెడ్లు దొరక్క కిక్కిరిసే ఆసుపత్రులు.. ఆందోళనలో డాక్టర్లు.. ఇదీ వారం క్రితం వరకు ఢిల్లీలో పరిస్థితి.

Covid Cases : ఊపిరిపీల్చుకుంటున్న ఢిల్లీ,  ఎలా సాధ్యమైంది ?

Delhi

Delhi : వేలల్లో కేసులు.. వందల్లో మరణాలు, శ్మశానాల వద్ద శవాల క్యూ లైన్లు.. ప్రాణవాయువు లేక గాల్లో కలిసే ఆయువు.. బెడ్లు దొరక్క కిక్కిరిసే ఆసుపత్రులు.. ఆందోళనలో డాక్టర్లు.. ఇదీ వారం క్రితం వరకు ఢిల్లీలో పరిస్థితి. కానీ ఇప్పుడు కాదు.. ఏప్రిల్ నెలలో ఐసీయూలో ఉన్న హస్తిన.. చిన్నగా జనరల్‌ వార్డులోకి షిఫ్ట్ అవుతోంది. ఓవైపు కేసుల్లో తగ్గుదల మరోవైపు అందుబాటులోకి వస్తున్న ఆక్సిజన్‌, బెడ్లు దేశ రాజధానివాసులను ఊపిరిపీల్చుకునేలా చేస్తుంది. నాలుగు వారాలుగా అమలవుతున్న లాక్‌డౌన్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో అక్కడ పరిస్థితుల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

వరుసగా వారం రోజుల పాటు కరోనా కేసుల తగ్గుదల కనిపిస్తోంది. అక్కడ కొత్తగా 8వేల 500 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 10 నుంచి అక్కడ పదివేల కంటే కేసులు తగ్గాయి. ప్రస్తుతం అక్కడ 77వేల యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. అక్కడి పాజిటివ్ రేటు తొలిసారి 12 శాతానికి చేరింది. గత నెల 32 శాతంగా ఉన్న అక్కడి పాజిటివిటీ రేటు తగ్గుతుండటం ఢిల్లీకి ఊరట ఇచ్చే విషయం. ప్రస్తుతం దేశ రాజధానిలో నాలుగో వారం లాక్‌డౌన్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఢిల్లీ కోలుకోవడానికి ముఖ్య కారణం అక్కడి వసతులు పెరగడమే.

సెకండ్ వేవ్‌లో మహారాష్ట్ర తర్వాత ఎక్కువ కేసులు ఢిల్లీలోనే నమోదయ్యాయి. ఆస్పత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌లు దొరక్క అక్కడ దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. సాయం కోసం ప్రజలు రోడ్లపై కార్లు పెట్టుకుని ట్రీట్‌మెంట్ తీసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితులు చేజారడంతో అక్కడ క్రేజీవాల్ సర్కార్ లాక్‌డౌన్‌ ప్రకటించింది. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ వసతులను పూర్తిగా మెరుగుపరిచేందుకు కృషి చేసింది. కోర్టులు, కేంద్రప్రభుత్వాలు జోక్యం చేసుకోవడంతో ఆక్సిజన్ సమస్య తీరిపోయింది.

అన్ని రాష్ట్రాలు ఢిల్లీకి ఆక్సిజన్‌ను పంపాయి. ఇక బెడ్‌ల కొరత తీర్చేందుకు కామన్ వెల్త్ గేమ్స్ విలేజ్, రాధా సోమి సత్ సంగ్ కోవిడ్ సెంటర్, సర్దార్ వల్లభయ్ కోవిడ్ సెంటర్, గురు తేగ్ బహదూర్ కోవిడ్ సెంటర్, ప్రగతి మైదాన్, రామ్ లీలా మైదాన్‌లను కోవిడ్ సెంటర్లుగా మార్చేసింది. దీంతో బెడ్‌ల కొరత కూడా తీరిపోయింది. ప్రస్తుతం అక్కడ రోజుకు ముప్పై వేల కేసులు వచ్చిన ఇబ్బంది లేకుండా అక్కడి ప్రభుత్వం అన్ని సదుపాయాలను సమకూర్చుకుంది.

ఆక్సిజన్‌, బెడ్‌ సమస్యలు తీరడంతో వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించింది ఢిల్లీ ప్రభుత్వం. హస్తినలో మూడు నెలల్లో అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు ప్రారంభించింది. వంద ప్రభుత్వ పాఠశాలను కోవిడ్ వ్యాక్సిన్‌ సెంటర్లుగా మార్చింది. రానున్న రోజుల్లో వాటిని మూడు వందలకు పెంచేలా ప్లాన్ చేస్తోంది కేజ్రీవాల్ సర్కార్‌.

ప్రస్తుతం రోజుకి లక్ష మందికి వ్యాక్సిన్‌ అందిస్తోంది. అందులో సగంమంది 45 ఏళ్లు పైబడిన వాళ్లుంటే.. మిగిలిన వాళ్లు 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు వాళ్లే. రోజుకు రెండు లక్షల మందికి వ్యాక్సిన్ అందించేలా ప్లాన్‌ చేస్తున్నామని.. అందుకు అనుగుణంగా వ్యాక్సిన్ డోసులు అందించాలని కేంద్రాన్ని కోరింది. మరోవైపు.. దేశంలోని రెండు ఆక్సిజన్ తయారీ సంస్థలకు కోటీ ముప్పై లక్షల డోసులను ఆర్డర్ చేసింది. ఇలా లాక్‌డౌన్ విధించి దాన్ని సద్వినియోగం చేసుకున్న కేజ్రీవాల్ సర్కార్‌.. కోవిడ్‌19 ను ఎదుర్కునేందుకు అన్ని చర్యలు చేపట్టింది.

Read More : Bombing Hits Mosque: రంజాన్ వేళ మసీదుపై బాంబు దాడి.. 12 మంది మృతి!