Dr S K Bhandari : కరోనాతో ఢిల్లీ టాప్ గైనకాలజిస్ట్ కన్నుమూత… ప్రియాంక గాంధీకి పురుడు పోసింది ఈవిడే

కరోనా మహమ్మారి దేశంలో విలయం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ లో ఈ మహమ్మారి మరింత ప్రాణాంతకంగా మారింది. దేశవ్యాప్తంగా ఎంతోమందిని పొట్టనపెట్టుకుంటోంది. ఇప్పటికే ఎంతో మంది సామాన్యులతో పాటు ప్రముఖులను కరోనా కాటేసింది. తాజాగా మరో ప్రముఖ వ్యక్తి కరోనాకు బలయ్యారు.

Dr S K Bhandari : కరోనాతో ఢిల్లీ టాప్ గైనకాలజిస్ట్ కన్నుమూత… ప్రియాంక గాంధీకి పురుడు పోసింది ఈవిడే

Dr S K Bhandari

Dr S K Bhandari : కరోనా మహమ్మారి దేశంలో విలయం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ లో ఈ మహమ్మారి మరింత ప్రాణాంతకంగా మారింది. దేశవ్యాప్తంగా ఎంతోమందిని పొట్టనపెట్టుకుంటోంది. ఇప్పటికే ఎంతో మంది సామాన్యులతో పాటు ప్రముఖులను కరోనా కాటేసింది. తాజాగా మరో ప్రముఖ వ్యక్తి కరోనాకు బలయ్యారు. ఢిల్లీకి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎస్.కే.భండారీ(86) కరోనాతో కన్నుమూశారు. వైద్యరంగంలో ప్రముఖ డాక్టర్లలో ఆమె ఒకరు. గురువారం(మే 13,2021) మధ్యాహ్నం 2గంటల సమయంలో భండారీ తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో ఆమె 58ఏళ్ల పాటు పని చేశారు. ఇటీవలే ఆమె కోవిడ్ బారిన పడ్డారు. టెస్టు చేయగా పాజిటివ్ అని వచ్చింది. అదే సమయంలో గుండె పోటు వచ్చింది. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇంతలోనే పరిస్థితి విషమించి కన్నుమూశారు.

డాక్టర్ భండారీ ఎంతోమంది ప్రముఖులకు పురుడు పోశారు. సోనియా గాంధీ పిల్లలు రాహుల్, ప్రియాంక గాంధీలకు డెలివరీ చేసింది ఈవిడే. ప్రియాంకకు పురుడు పోసింది కూడా ఈవిడే. బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్ జోషికి బాగా దగ్గరి మనిషి.

”గైనకాలజీలో ఆమె చాలా ఫేమస్. దేశంలోని ప్రముఖ గైనకాలజిస్టుల్లో ఆమె ఒకరు. గంగారామ్ ఆసుపత్రిలో 1962లో చేరారు. అలా 58ఏళ్లు సేవలు అందించారు. నేను 1980లలో గంగా రామ్ ఆసుపత్రిలో చేరాను. ఆ సమయంలో గైనకాలజీ విభాగంలో ఇద్దరే ఫేమస్. వారిలో ఒకరు డాక్టర్ షీలా మెహ్రా, మరొకరు డాక్టర్ భండారీ. ఇప్పుడు ఇద్దరూ చనిపోయారు. చనిపోవడానికి 6 నెలల ముందు వరకు కూడా డాక్టర్ భండారీ పని చేస్తూనే ఉన్నారు. గత రెండు నెలల నుంచి ఆమె గుండె సమస్యలతో బాధపడుతున్నారు” అని గంగారామ్ ఆసుపత్రి డాక్టర్ రానా చెప్పారు.

”ఇటీవల గుండె ఫెయిల్యూర్ కి సంబంధించి డాక్టర్ భండారీ ఆసుపత్రిలో చేరారు. అదే సమయంలో కరోనా పాజిటివ్ అని తెలిసింది. దీంతో ఆమె గుండె, కిడ్నీ సమస్యలు పెరిగాయి. గత రెండు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె భర్త, మాజీ ఐఏఎస్, జేఎస్ భండారీ సైతం అనారోగ్యానికి గురయ్యారు. కోవిడ్ న్యూమోనియా కారణంగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయన వయసు 97ఏళ్లు. కాగా, ఇద్దరూ అప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉన్నారు. డాక్టర్ భండారీకి ఒక కూతురు ఉంది. ఆమె కూడా డాక్టరే. ఆమె కూడా కరోనా బారిన పడింది” అని డాక్టర్ రానా చెప్పారు.

”’డాక్టర్ భండారీ మృతి పట్ల కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర సంతాపం తెలిపారు. ఆమె తన ట్వీట్ లో భండారీని గుర్తు చేసుకున్నారు. నా సోదరుడు రాహుల్ గాంధీ, నన్ను, నా కొడుకు, నా కూతురికి డెలివరీ చేసిన డాక్టర్ భండారీ ఇక లేరు. 70ఏళ్ల వయసులోనూ ఆమె కారుని డ్రైవ్ చేసుకుంటూ ఉదయాన్నే ఆసుపత్రికి వెళ్లేవారు. నేను గౌరవించే మహిళ, నా ఫ్రెండ్ ని శాశ్వతంగా మిస్ అవుతున్నా” అంటూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.