Delta Plus Covid Variant : భారత్ లో 22 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు

కొత్తగా వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ కోవిడ్ వేరియంట్ భారత్ లో కోవిడ్ మూడో దశకి ప్రధాన కారణం అయ్యే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో భారత్ తో సహా 9 దేశాల్లో...

Delta Plus Covid Variant : భారత్ లో 22 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు

Rajesh Bhushan

Delta Plus Covid Variant కొత్తగా వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ కోవిడ్ వేరియంట్ భారత్ లో కోవిడ్ మూడో దశకి ప్రధాన కారణం అయ్యే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో భారత్ తో సహా 9 దేశాల్లో(యూకే,జపాన్,రష్యా,పోర్చుగల్,నేపాల్,చైనా,స్విట్జర్లాండ్,అమెరికా) డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నయోదయ్యాయని మంగళవారం(జూన్-22,2021)కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. భారత్ లో సెకండ్ వేవ్ కి కారణమని భావిస్తున్న డెల్టా వేరియంట్ 80 దేశాల్లో ఉందని తెలిపారు.

మన దేశంలో ఇప్పటివరకు 22 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి రాజేష్ భూషన్ తెలిపారు. ఇందులో16 కేసులు మహారాష్ట్రలోని రత్నగిరి మరియు జలగాన్ లో నమోదయ్యాయని..మిగిలినవి మధ్యప్రదేశ్ మరియు కేరళ రాష్ట్రాల్లో నమోదయ్యాయని తెలిపారు. ఆందోళనకరమైన వేరియంట్ కేటగిరిలో..డెల్టా ప్లస్ వేరియంట్ ని చేర్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఉపయోగిస్తున్న రెండు వ్యాక్సిన్లు(కోవిషీల్డ్,కోవాగ్జిన్)డెల్టా వేరియంట్ పై ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని..అయితే డెల్టా ప్లస్ పై వీటి ప్రభావం గురించిన పూర్తి సమాచారం త్వరలోనే తెలియజేస్తామన్నారు. ఇక,సోమవారం ఒక్క రోజే భారత్.. 88.09లక్షల మందికి వ్యాక్సిన్ అందించి మరో రికార్డు సృష్టించిందని తెలిపారు.

మరోవైపు,డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు మరిన్ని నమోదు కాకుండా చూసే ప్రయత్నాల్లో భాగంగా కేసులు నమోదైన రాష్ట్రాలకు కేంద్రం ఓ అడ్వైజరీని పంపిందని నీతి ఆయోగ్ సభ్యుడు మరియు వ్యాక్సిన్ నిర్వహణపై ఏర్పాటైన జాతీయ నిపుణుల బృందం హెడ్ వీకే పాల్ తెలిపారు.