Delta Plus : డెల్టా ప్లస్ వేరియంట్ పై కేంద్రం కీలక ప్రకటన

యూరప్ లో ఇటీవల వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ పై ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని కేంద్రం తెలిపింది.

Delta Plus : డెల్టా ప్లస్ వేరియంట్ పై కేంద్రం కీలక ప్రకటన

Delta Plus

Delta Plus యూరప్ లో ఇటీవల వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ పై ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని కేంద్రం తెలిపింది. యూరప్ లో మార్చి నెల నుంచే ఈ వేరియంట్‌ ఉందని..జూన్-13న ప్రజలకు దీని గురించి తెలిసిందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు.

దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ ముఖ్య పాత్ర పోషించిందన్న వీకే పాల్…కొత్త డెల్టా ప్లస్ ఆందోళకరమైన వేరియంటా కాదా అన్నది ఇంకా తేలాల్సి ఉందన్నారు. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ గురించి మరింత తెలుసుకుని..దాని పురోగతిని ప్రభుత్వం ట్రాక్‌ చేస్తుందని వీకే పాల్ తెలిపారు. ఇక,త్వరలోనే అమెరికాకు చెందిన నోవావాక్స్ కోవిడ్ వ్యాక్సిన్ ను త్వరలోనే సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుందని పాల్ తెలిపారు.

మరోవైపు,ఇక, దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మే 7న నమోదైన గరిష్ఠ కేసులతో పోలిస్తే.. రోజూవారీ కేసుల్లో 85 శాతం క్షీణత కనిపిస్తోందని తెలిపింది. ప్రస్తుతం 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు 5 వేల కన్నా తక్కువ ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.