Delta Plus Covid Variant: 4 రాష్ట్రాల్లో డెల్టాప్లస్​.. బీ అలెర్ట్ అంతే!

కరోనా సెకండ్ వేవ్ లో ఇండియా ఎంతగా ప్రభావితమైందో అందరికీ తెలిసిందే. వూహన్ కరోనా నుండి మ్యుటేట్ అయిన డెల్టా వేరియంట్ మరింత ప్రజల ప్రాణాలను బలితీసుకుంది. ఈ వేరియంట్ కారణంగానే తొలి దశను మించి రెండో దశలో మరింత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. ఇప్పుడు డెల్టా వేరియంట్ మరోసారి మ్యుటేట్ అయి డెల్టా ప్లస్ గా మారింది.

Delta Plus Covid Variant: 4 రాష్ట్రాల్లో డెల్టాప్లస్​.. బీ అలెర్ట్ అంతే!

Delta Plus Covid Variant

Delta Plus Covid Variant: కరోనా సెకండ్ వేవ్ లో ఇండియా ఎంతగా ప్రభావితమైందో అందరికీ తెలిసిందే. వూహన్ కరోనా నుండి మ్యుటేట్ అయిన డెల్టా వేరియంట్ మరింత ప్రజల ప్రాణాలను బలితీసుకుంది. ఈ వేరియంట్ కారణంగానే తొలి దశను మించి రెండో దశలో మరింత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. ఇప్పుడు డెల్టా వేరియంట్ మరోసారి మ్యుటేట్ అయి డెల్టా ప్లస్ గా మారింది. ఇప్పటికే ఇది మన దేశంతో సహా మొత్తం తొమ్మిది దేశాలకు విస్తరించింది. ఇప్పటికైతే మన కేంద్రం దీన్ని వేరియంట్‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా మాత్రమే వర్గీకరించింది.

కాగా, కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ డెల్టా ప్లస్ కోవిడ్ వేరియంట్ భారత్ లో కోవిడ్ మూడో దశకి ప్రధాన కారణం అయ్యే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇది మన దేశంలో నాలుగు రాష్ట్రాలకు విస్తరించింది. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌, కర్ణాటకలో ఈ వేరియంట్ విస్తరించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించగా మహారాష్ట్రలో అత్యధికంగా ఇప్పటివరకు 21 డెల్టాప్లస్ కేసులను గుర్తించారు. ఈ వేరియంట్‌తోనే ఇప్పుడు అక్కడ మూడోముప్పు పొంచి ఉందని ఆరోగ్యశాఖ ఇదివరకే అంచనా వేసింది.

మరోవైపు కేరళలో మూడు కేసులు, కర్ణాటకలో రెండు, మధ్యప్రదేశ్‌లో ఒక కేసు బయటపడినట్టు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. డెల్టాప్లస్ వేరియంట్ మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ఔషధాన్ని ఏమారుస్తుందనే నివేదికలు ఆందోళన కలిగిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ హెచ్చరించింది. థర్డ్ వేవ్ రావడం అనేది ఎంతటి ఆందోళన అనిపిస్తుందో.. డెల్టాప్లస్ రూపంలో థర్డ్ వేవ్ వస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేదానిపై ఇప్పుడు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.