వివాదాస్పద వ్యాఖ్యలు : భారతదేశంలో బుర్ఖాను నిషేధించాలి – రఘురాజ్ సింగ్

  • Published By: madhu ,Published On : February 10, 2020 / 09:08 PM IST
వివాదాస్పద వ్యాఖ్యలు : భారతదేశంలో బుర్ఖాను నిషేధించాలి – రఘురాజ్ సింగ్

ఉత్తర్ ప్రదేశ్ కేబినెట్ మినిస్టర్ రఘురాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుర్ఖాను నిషేధించాలని డిమాండ్ చేశారాయన. 2020, ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం ఆయన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. ఇతర దేశాల్లో అమలు అవుతోందన్నారు. శ్రీలంక, చైనా, యూఎస్, కెనడా వంటి దేశాల్లో బుర్ఖాను ధరించడం లేదన్నారు.

దీనిని ఉగ్రవాదులు సద్వినియోగం చేసుకోనే అవకాశం ఉంది..కనుకే…భారతదేశంలో బ్యాన్ చేయాలని స్పష్టం చేశారు. దీనిపై బీజేపీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఎవరికీ తమ ముఖాలు కనిపించకుండా..ఉండటానికే బుర్ఖాలు ధరించి..పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ర్యాలీలో పాల్గొంటున్నారన్నారు. దేశంలో ముస్లింలు కావాలనే బుర్ఖాలు ధరిస్తారంటూ వివాదాస్పదంగా మాట్లాడారు. బుర్ఖా అనేది అరేబియా దేశాల నుంచి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. జాతీయ భద్రతకు ముప్పుగా మారినందు వల్లే నిషేధించాలని కోరుతున్నట్లు తెలిపారు. 

 

బుర్ఖాను సూర్పనఖతో పోల్చారు ఆయన. ఆమె ముక్కు, చెవులు కత్తిరించినందు వల్లే..ముఖాన్ని దాచడానికి బుర్ఖాను ఉపయోగించదంటూ చెప్పారు. ప్రస్తుతం అది అవసరం లేదని స్పష్టం చేశారు. దెయ్యం గురువు శుక్రాచార్యలు మక్కాలో శివలింగాన్ని ఏర్పాటు చేశారని, అక్కడి నుంచే బుర్ఖా సంప్రదాయం ప్రారంభమైందన్నారు. హిందూస్తాన్ కాబట్టి..హిందువుల సంప్రదాయల ప్రకారం నడవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. 

గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రఘురాజ్  సింగ్. యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన..ఆలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ విద్యార్థులను సజీవంగా పాతిపెడుతామంటూ…కామెంట్స్ చేశారు. తాజాగా బుర్ఖాపై చేసిన ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ లీడర్ పునియా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్‌లు ఖండించారు.