Dengue Outbreak: డెంగీ డేంజర్ బెల్స్.. కేంద్రం హైఅలర్ట్.. రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

దేశవ్యాప్తంగా డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకీ డెంగీ జ్వరాలు తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నాయి. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో డెంగీ తీవ్రత ఆందోళనకరంగా మారింది.

Dengue Outbreak: డెంగీ డేంజర్ బెల్స్.. కేంద్రం హైఅలర్ట్.. రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

Dengue Outbreak Centre Sends Central Teams To 9 States, Union Territories

Dengue Outbreak: దేశవ్యాప్తంగా డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకీ డెంగీ జ్వరాలు తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నాయి. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో డెంగీ తీవ్రత ఆందోళనకరంగా మారింది. దాంతో కేంద్రం డెంగీ ప్రభావిత ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలో డెంగీ మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. డెంగీ కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. డెంగీ కేసుల తీవ్రత పెరిగిపోవడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో డెంగీ విషజ్వరాల పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తోంది. వ్యాధి నియంత్రణ, నిర్వహణ కోసం డెంగీ ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపుతోంది.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశించారు. 9 రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉన్నత స్థాయి వైద్య నిపుణుల బృందాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. ఢిల్లీ, పంజాబ్​, హరియాణా, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్​, జమ్ముకశ్మీర్​లలో డెంగీ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గత ఐదేళ్లలో అత్యధిక డెంగీ మరణాలు ఈ సీజన్‌లోనే నమోదు కావడం వ్యాధి తీవ్రత ఎంత స్థాయిలో వ్యాపించి ఉందో అద్దం పడుతోంది.
Read Also : Delhi Air Quality : ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం.. ‘వెరీ పూర్’ ఇదే ఫస్ట్ టైం! 

ఒక్క వారంలోనే 531 కొత్త డెంగీ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,530కి చేరింది. డెంగీ బారినపడి ఇప్పటివరకూ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. డెంగీ కేసుల తీవ్రతను నివారించేందుకు పరీక్షలను వేగవంతం చేయాలని డెంగీ NN-1 ఎలీసా టెస్టింగ్ కిట్లను అందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం సూచనలు చేసింది.

రాష్ట్రాలకు పంపే కేంద్ర నిపుణుల బృందాలలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్​లకు సంబంధించి అధికారులు ఉన్నారు. 2015లో ఢిల్లీలో డెంగీ తీవ్రస్థాయిలో వ్యాపించింది. అక్టోబరులోనే 10,600కు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి.

2018 తర్వాత ఢిల్లీలో అత్యధిక డెంగీ మరణాలు ఈ ఏడాదే నమోదయ్యాయి. 2016లో 10మంది డెంగీతో మృతిచెందారు. జనవరి 1 నుంచి అక్టోబర్ 30 మధ్యకాలంలో డెంగీ కేసులు, 2020లో 612, 2019లో 1,069, 2018లో 1,595 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది 1,530 కొత్త డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో జనవరి-ఆగస్టు మధ్య 124 కేసులు నమోదు కాగా.. ఆగస్టు తర్వాత డెంగీ కేసుల తీవ్రత పెరిగింది.
Read Also :  India Covid – 19 : భారత్‌‌లో కరోనా..కొత్తగా ఎన్ని కేసులంటే