Madhya Pradesh: అంబులెన్స్ కోసం త‌మ్ముడి మృత‌దేహంతో రోడ్డుపై కూర్చున్న‌ ఎనిమిదేళ్ల బాలుడు.. పోలీసులు రావ‌డంతో..

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మొరెనా వీధుల్లో ఎనిమిదేళ్ల బాలుడు తన రెండేళ్ల తమ్ముడి మృతదేహంతో కూర్చుని కనిపించాడు. పిల్లల తండ్రి పూజారామ్ జాతవ్ చనిపోయిన తన కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నించాడు. ఆస్ప‌త్రి సిబ్బంది అందుకు నిరాక‌రించ‌డంతో చేసేదేమీలేక రోడ్డుప‌క్క‌న మృత‌దేహాన్ని వ‌దిలేసి వెళ్లిపోయాడు.

Madhya Pradesh: అంబులెన్స్ కోసం త‌మ్ముడి మృత‌దేహంతో రోడ్డుపై కూర్చున్న‌ ఎనిమిదేళ్ల బాలుడు.. పోలీసులు రావ‌డంతో..

Madya Pradesh

Madhya Pradesh: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మొరెనా వీధుల్లో ఎనిమిదేళ్ల బాలుడు తన రెండేళ్ల తమ్ముడి మృతదేహంతో కూర్చుని కనిపించాడు. పిల్లల తండ్రి పూజారామ్ జాతవ్. చనిపోయిన తన కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నించాడు. ఆస్ప‌త్రి సిబ్బంది అందుకు నిరాక‌రించ‌డంతో చేసేదేమీలేక రోడ్డుప‌క్క‌న మృత‌దేహాన్ని వ‌దిలేసి వెళ్లిపోయాడు. దీంతో రెండేళ్ల త‌మ్ముడి మృత‌దేహాన్ని ప‌ట్టుకొని ఎనిమిదేళ్ల బాలుడు రోడ్డుప‌క్క‌నే కూర్చున్నాడు. స్థానికులు బాలుడి వ‌ద్ద‌కు వెళ్లి ఆరాతీయ‌గా.. నాన్న వ‌స్తాడ‌ని, త‌మ్ముడిని ఇంటికి తీసుకెళ్తామ‌ని చెప్పాడు. బాలుడిని చూసిన ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున గుమికూడి విష‌యాన్నిఉన్న‌తాధికారుల‌కు స‌మాచారం అందించారు.

Ranbir Kapoor : మా ఇంట్లో టెన్త్ పాసైన మొదటి వ్యక్తి నేనే.. పాస్ అయినందుకే పెద్ద పార్టీ చేశారు..
మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం అంబాహ్‌లోని బద్‌ఫ్రా గ్రామంకు పూజారాం జాతవ్ కు ఇద్ద‌రు కుమారులు. రెండేళ్ల కుమారుడు రాజా ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. మొదట్లో జాతవ్ తన కొడుకుకు ఇంట్లోనే వైద్యం అందించాడు. కానీ.. అతనికి కడుపు నొప్పి భరించలేనంత‌గా రావ‌డంతో రాజాను మొరెనా జిల్లాలోని ఓ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లాడు. అతనితో పాటు అతని పెద్ద కుమారుడు గుల్షన్ కూడా ఆసుపత్రికి వెళ్లాడు. అయితే మొరెనా జిల్లా ఆసుపత్రిలో రాజా మృతి చెందాడు. నిరుపేద, నిస్సహాయుడైన పూజారాం మృతదేహాన్ని తిరిగి స్వగ్రామానికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఆసుపత్రి అధికారులను వేడుకున్నాడు. ఎన్నిసార్లు అభ్య‌ర్థించిన ఆస్ప‌త్రి సిబ్బంది అందుకు నిరాక‌రించారు.

Telangana BJP: నేడు క‌రీంన‌గ‌ర్‌లో బండి సంజ‌య్ మౌనదీక్ష‌.. ఎందుకంటే..

ఆసుపత్రి అధికారులు అంబులెన్స్‌ను నిరాకరించడంతో ఆ వ్యక్తి తన బిడ్డ మృతదేహంతో ఆసుపత్రి నుండి బయటకు వచ్చి రోడ్డుపై కూర్చున్నాడు. కొడుకు మృత‌దేహం ఇంటికి తీసుకెళ్లేందుకు ఏ వాహనం దొరక‌క పోవ‌టంతో తీవ్ర ఆవేద‌నకు గురైన పూజారామ్ వేరే మార్గం లేక తన పెద్ద కొడుకు గుల్షన్‌ను మృతదేహంతో ఆసుపత్రి వెలుపల వదిలి ఇంటికి వెళ్లి వ‌స్తాన‌ని వెళ్లిపోయాడు. ఎనిమిదేళ్ల బాలుడు గుల్షన్ రోడ్డుపై రెండేళ్ల త‌మ్ముడి మృత‌దేహంతో త‌న ఒడిలో త‌మ్ముడి త‌ల‌ను పెట్టుకుని తండ్రి తిరిగి వస్తాడనే ఆశతో ఎదురుచూస్తూ కూర్చుండిపోయాడు. అరగంట సేపు అక్కడే కూర్చున్నాడు. స్థానికులు బాలుడి వ‌ద్ద‌కు వెళ్లి ఏం జ‌రిగింద‌ని ఆరాతీయ‌గా అస‌లు విష‌యంలో వెలుగులోకి వ‌చ్చింది. దీంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. వారు ఘ‌ట‌న స్థ‌లికి చేరుకొని ఆస్ప‌త్రి సిబ్బందితో మాట్లాడి అంబులెన్స్‌ను ఏర్పాటు చేయించారు.

Heavy Rain: ఆ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వ‌ర్షం ప‌డొచ్చు.. తెలంగాణ‌లో నేడు, రేపు అతి భారీ వ‌ర్షాలు!

ఈ విష‌యంపై పూజారామ్ జాతవ్ మాట్లాడుతూ.. బిడ్డ తల్లి ఇంట్లో లేదు, నేను పేదవాడిని. నా బిడ్డ ఏమి తిన్నాడో నాకు తెలియదు. అతని పరిస్థితి మరింత దిగజారింది. నేను వైద్యుడిని సంప్రదించినప్ప‌టికీ ఉప‌యోగం లేకుండా పోయింది. మృత‌దేహాన్ని త‌ర‌లించేందుకు నా ద‌గ్గ‌ర అంత‌డ‌బ్బు లేదు. దీంతో ఆస్ప‌త్రి సిబ్బందిని అంబులెన్స్ ఏర్పాటు చేయాల‌ని వేడుకున్నా వారు వినిపించుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. మోరీనా సివిల్ సర్జన్ వినోద్ గుప్తా మాట్లాడుతూ.. బాలుడు మృత‌దేహాన్ని త‌ర‌లించేందుకు మేము అంబులెన్స్ ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. వాహనం వచ్చే సమయానికి పిల్లల తండ్రి వెళ్ళిపోయాడని తెలిపాడు.