TMCకి మరో షాక్..ప్రముఖ నటి,MLA దేబశ్రీ రాయ్ రాజీనామా

వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC)కి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. ఇప్పటికే పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలు,మంత్రులు,కీలక నేతలు కాషాయకండువా కప్పుకోగా..తాజాగా మరో ఎమ్మెల్యే టీఎంసీకి గుడ్ బై చెప్పారు.

TMCకి మరో షాక్..ప్రముఖ నటి,MLA దేబశ్రీ రాయ్ రాజీనామా

Debasree Roy

Debasree Roy వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC)కి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. ఇప్పటికే పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలు,మంత్రులు,కీలక నేతలు కాషాయకండువా కప్పుకోగా..తాజాగా మరో ఎమ్మెల్యే టీఎంసీకి గుడ్ బై చెప్పారు. గత వారం 291స్థానాలకు మమతా బెనర్జీ ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్ లో తన పేరు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రముఖ నటి, ఎమ్మెల్యే దేబశ్రీ రాయ్(59)​..సోమవారం టీఎంసీకి రాజీనామా చేశారు.

టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రతా బక్షీకి..దేబశ్రీ రాయ్ తన రాజీనామా లేఖ పంపారు. తాను పార్టీలో ఏ పదవిలోనూ లేకపోయినప్పటికీ.. పార్టీ నాయకత్వానికి సమాచారం అందించాల్సిన అవసరం ఉందని భావించి ఈ లేఖ రాస్తున్నా.. టీఎంసీతో ఎలాంటి సంబంధం కలిగి ఉండకూడదని నిర్ణయించుకున్నా అని ఆమె తెలిపారు. అయితే బీజేపీలో చేరికపై ఎమ్మెల్యే దేబశ్రీ రాయ్ క్లారిటీ ఇవ్వలేదు. భవిష్యత్తు ప్రణాళికపై ప్రశ్నించగా.. ప్రస్తుతానికి తాను నటనపై దృష్టి సారించనున్నట్లు మాత్రమే ఆమె తెలిపారు. కానీ బలమైన ప్రతిపాదన వస్తే ఏదైనా పార్టీలో చేరేందుకు సిద్ధమేనని కోల్ కతా సీనీ పరిశ్రమలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన దేబశ్రీ రాయ్ ప్రకటించారు.

2011నుంచి సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని రాయ్ ధిగా నియోజవకర్గ టీఎంసీ ఎమ్మెల్యేగా దేబశ్రీ రాయ్.. 2019లోనే బీజేపీ చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే.. అప్పటికే టీఎంసీ నుంచి బీజేపీలోకి వెళ్లిన కోల్​కతా మాజీ మేయర్​ సోవన్​ ఛటర్జీ, ఆయన స్నేహితుడు బైసాఖి బందోపధ్యాయ్​ ఆమె కమలదళంలోకి రావడాన్ని వ్యతిరేకించారు. యాదృచ్ఛికంగా.. తనకు టికెట్టు కేటాయించలేదనే కారణంతో ఆదివారం బీజేపీకి రాజీనామా చేశారు సోవన్ ఛటర్జీ. అయితే,రాయ్..కాషాయకండువా కప్పుకునే అవకాశాలున్నట్లు సమాచారం.

కాగా,మార్చి-27నుంచి ప్రారంభం కానున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్-29వరకు ఎనిమిది దశల్లో జరగనున్నాయి. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.