Dengue Fever: చెలరేగుతున్న డెంగీకి చెక్ పెట్టండిలా..

జూలై వరకు దేశవ్యాప్తంగా 14వేల కంటే ఎక్కువ డెంగీ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయని రిపోర్టుల్లో స్పష్టమవుతుంది. ఢిల్లీలో ఆరేళ్లుగా డెంగీ కేసుల్లో ఈ ఏడాదే అత్యధికం.

Dengue Fever: చెలరేగుతున్న డెంగీకి చెక్ పెట్టండిలా..

Dengue Fever

Dengue Fever: ఓ వైపు వర్షాకాలం.. ప్రబలుతున్న వైరల్ జ్వరాలు, ఇంకా వీడిపోని మహమ్మారి కరోనా వైరస్. ఇంత దారుణమైన పరిస్థితుల్లో చాప కింద నీరులా చెలరేగిపోతుంది డెంగీ జ్వరం. ఇప్పటికే ఇండియాలోని 11 రాష్ట్రాల్లో డెంగీ కొత్త వేరియంట్ భయబ్రాంతులకు గురిచేసి వణికిస్తోంది. డెంగీ కేసులు నమోదైన రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతూనే ఉన్నాయని ఆరోగ్య శాఖ రిపోర్టులు చెబుతున్నాయి.

జూలై వరకు దేశవ్యాప్తంగా 14వేల కంటే ఎక్కువ డెంగీ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయని రిపోర్టుల్లో స్పష్టమవుతుంది. ఢిల్లీలో ఆరేళ్లుగా డెంగీ కేసుల్లో ఈ ఏడాదే అత్యధికం. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటి వరకు 6వేలకి పైగా కేసులు వచ్చినట్లు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చెబుతుంది. పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, పంజాబ్ వంటి రాష్ట్రాలలో కూడా డెంగీ తీవ్రత ఎక్కువగానే ఉంది.

ఇతర వేరియంట్ల కంటే డెంగీ D2 వేరియంట్ ప్రమాదకరంగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీని బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కాస్త వరకూ బయటపడగలం.

నిల్వ చేసిన నీటిని తాగడం మానేయాలి. పగటి పూట కూడా దోమలు దాడి చేస్తున్నాయి కాబట్టి కాళ్లు, చేతులు పూర్తిగా కప్పి ఉంచేలా డ్రెస్ వేసుకోవాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నిత్యం వేడి ఆహారాలను తీసుకోవడం ఉత్తమం. నీరు ఏదైనా పరిస్థితుల్లో నిల్వ ఉండిపోతే అక్కడ కిరోసిన్ చల్లాలి. పాత టైర్లు, పగిలిపోయిన కుండలు, ఇంటి ముందు రోడ్డుపై గుంతలు లేకుండా చూసుకుంటే నీరు నిల్వ లేకుండా ఉంటుంది.

డెంగీ వచ్చిందంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి. డీ 2 వేరియంట్‌ సోకిన వారిలో తీవ్రంగా జ్వరం, వాంతులు, కీళ్ల నొప్పులు కనిపిస్తాయి.

…………………………………….: కేన్సర్ వ్యాధిగ్రస్తులకు పంచ సూత్రాలు

సోకితే ఏం చేయాలి?
డీ2 వేరియంట్ సోకినట్లయితే.. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. నీరు లేదా ఇతర ద్రవాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచాలి. అనాల్జెసిక్స్, ఆస్పిరిన్ వంటి మందులకు దూరంగా ఉండాలి. స్వయంగా మందులు వాడకుండా వైద్యుడిని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి.