Ganga Vilas Cruise: గంగా విలాస్ నదిలో నిలిచిపోలేదు.. ఆ వార్తలు అవాస్తవం.. పోర్టు, జల రవాణా శాఖ ప్రకటన

బీహార్ రాష్ట్రం ఛప్రా సమీపంలో గంగా నదిలో నౌక కదలడానికి సరిపడినంత నీటి ప్రవాహం లేకపోవడంతో పర్యాటకులను టగ్  బోట్లలో ఒడ్డుకు చేర్చినట్లు ప్రచారం జరిగిందని, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పోర్జు, జల రవాణా శాఖ తెలిపింది.

Ganga Vilas Cruise: గంగా విలాస్ నదిలో నిలిచిపోలేదు.. ఆ వార్తలు అవాస్తవం.. పోర్టు, జల రవాణా శాఖ ప్రకటన

Ganga Vilas Cruise

Ganga Vilas Cruise: ప్రపంచంలోనే అత్యంత పొడవైన లగ్జరీ రివర్ క్రూయిజ్ గంగా విలాస్‌ను వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన విషయం విధితమే. ఈ క్రూయిజ్ భారత్, బంగ్లాదేశ్‌లలోని రెండు మహానదులపై 3,200 కిలో మీటర్లు మేర ప్రయాణిస్తుంది. మోడీ ప్రారంభించిన రోజు ఈ క్రూయిజ్ విహార యాత్ర ప్రారంభమైంది. సోమవారం ఈ క్రూయిజ్ బీహార్ రాష్ట్రంలోని ఛప్రా వద్ద గంగానదిలో నిలిచిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ గంగా వికాస్ క్రూయిజ్ గంటల తరబడి ఆగిపోవడంతో అందులోని ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని, వారిని టగ్ బోట్లలో ఒడ్డుకు చేర్చారని విస్తృత ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని పోర్టు, జల రవాణా శాఖ ప్రకటన విడుదల చేసింది.

Ganga Vilas Cruise: పర్యాటక రంగం కొత్త యుగానికి నాంది పలుకుతుంది.. గంగా విలాస్‌ క్రూయిజ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ఛప్రా సమీపంలో గంగా నదిలో నౌక కదలడానికి సరిపడినంత నీటి ప్రవాహం లేకపోవడంతో పర్యాటకులను టగ్  బోట్లలో ఒడ్డుకు చేర్చినట్లు ప్రచారం జరిగిందని, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని జల రవాణా శాఖ తెలిపింది. అనుకున్న సమయానికి నౌక పట్నాకు చేరుకుందని, యాత్ర యథావిధిగా సాగుతుందని వెల్లడించింది. నీటి మట్టం విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని పేర్కొంది.

World Longest River Cruise ‘Ganga Vilas’ : ప్రపంచంలోనే అతి పెద్ద రివర్ క్రూయిజ్..‘గంగా విలాస్’..జనవరి 13న జెండా ఊపి ప్రారంభించినున్న ప్రధాని మోడీ

గంగా విలాస్ క్రూయిజ్ నిలిచిపోయిందన్న వార్తలపై భారత అంతర్గత జలరవాణా ప్రాధికార సంస్థ చైర్మన్ సంజయ్ బందోపాధ్యాయ మాట్లాడారు. క్రూయిజ్ ఆగిపోయిందని ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. పర్యటకుల వ్యక్తిగత గోప్యత, భద్రతలను దృష్టిలో ఉంచుకొని టగ్ బోట్లలో వారిని ఒడ్డుకు తీసుకురావడం జరిగిందని, తిరిగి వాటిల్లోనే మళ్లీ క్రూయిజ్ వద్దకు తీసుకురావటం జరిగిందని తెలిపారు. ఇదే పద్దతిలో డోరీగంజ్ ను కూడా ప్రయాణికులు సందర్శించారని తెలిపారు.