RBI షాకింగ్ ఆర్డర్ : ఆ బ్యాంక్ నుంచి వెయ్యికి మించి విత్ డ్రా చేయలేరు

  • Published By: venkaiahnaidu ,Published On : September 24, 2019 / 11:38 AM IST
RBI షాకింగ్ ఆర్డర్ : ఆ బ్యాంక్ నుంచి వెయ్యికి మించి విత్ డ్రా చేయలేరు

ముంబై బేస్డ్ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (PMC BANK) ఖాతాదారులు వెయ్యి రూపాయలకు మించి విత్ డ్రా చేసుకోవడానికి వీల్లేకుండా ఆర్బీఐ పరిమితులు విధించింది. సేవింగ్స్ అకౌంట్ అయినా, కరెంట్ అకౌంట్ నుంచి అయినా, ఏ ఇతర డిపాజిట్ అకౌంట్ నుంచి అయినా వెయ్యి రూపాయలకు మించి విత్ డ్రా చేసుకోలేరని, సెప్టెంబర్ 23నుంచి ఆరు నెలల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఆర్బీఐ తెలిపింది. అంతేకాకుండా పీఎమ్ సీ బ్యాంక్ తమ కస్టమర్లకు ఎలాంటి అడ్వాన్స్ లు, లోన్స్ కానీ ఇవ్వకుండా ఆర్బీఐ నిషేధం విధించింది.

అయితే పీఎమ్ సీ బ్యాంక్ పై విధించిన ఆంక్షలు ఆ బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లుగా భావించరాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. తదుపరి నోటీసు,సూచనల వరకు పీఎమ్ సీ బ్యాంకింగ్ వ్యాపారం పరిమితులతో కొనసాగుతుందని. పరిస్థితులను బట్టి ఈ ఆదేశాల మార్పులను రిజర్వ్ బ్యాంక్ పరిగణించవచ్చు అని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.

దీంతో సెప్టెంబర్ 24, 2019 మంగళవారం PMC బ్యాంక్ ఖాతాదారులు ముంబై బందూప్ ఏరియాలోని బ్యాంక్ మెయిన్ బ్రాంచ్, ఇతర బ్రాంచ్ ల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. RBI ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతున్నారు. తమ డబ్బులు తాము తీసుకోకుండా చేస్తున్నారని ఆరోపించారు.

అయితే పీఎమ్ సీ బ్యాంక్ పై విధించిన ఆంక్షలు ఆ బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లుగా భావించరాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. తదుపరి నోటీసు, సూచనల వరకు పీఎమ్ సీ బ్యాంకింగ్ వ్యాపారం పరిమితులతో కొనసాగుతుందని.. పరిస్థితులను బట్టి ఈ ఆదేశాల మార్పులను రిజర్వ్ బ్యాంక్ పరిగణించవచ్చు అని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.