చర్మం రంగు బాగాలేదనే టీనేజర్ ఆత్మహత్య

చర్మం రంగు బాగాలేదనే టీనేజర్ ఆత్మహత్య

suicide

Skin Colour: చర్మం రంగు బాగాలేదనే ఆత్మన్యూనతా భావానికి లోనైన వ్యక్తి 15వ అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పదకొండో తరగతి చదువుతున్న వ్యక్తి.. చర్మం రంగు తక్కువగా ఉండటంతో ఫిజికల్ లుక్ సరిగా లేదనే బాధలో ఉన్నాడు. తండ్రి ఎమ్ఎన్సీ కంపెనీలో పనిచేస్తూ నోయిడాలో ఉంటున్నాడు. తల్లి గుర్‌గావ్ లో ఉంటున్నారు.

పేరెంట్స్ కు దూరంగా ఉంటున్న ఈ టీనేజర్ 15వ అంతస్థు పై నుంచి సూసైడ్ చేసుకున్నాడు. ఘటనపై అలర్ట్ అయిన పోలీసులు ఉదయం 5గంటల సమయంలో ప్రాంతానికి చేరుకున్నారు. ‘పేరెంట్స్ సమాచారం ఇచ్చాకే పోలీసులు అక్కడికి వచ్చారు. రంగు తక్కువగా ఉన్నాడని డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. దీని గురించి గతంలోనూ చెప్పి బాధపడుతుండేవాడు.

ఫ్యామిలీ ఎటువంటి కంప్లైంట్ ఇవ్వకపోవడంతో బాడీని పోస్టు మార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. తగ్గించుకోదగ్గ డిప్రెషన్ ను ఇలా సూసైడ్ కు దారితీసేంత వరకూ ఉంచుకోకూడదని నిపుణులు అంటున్నారు.

20ఏళ్ల అంతకంటే తక్కువ వయస్సున్న వారు, టీనేజర్లు బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ తో బాధపడుతున్నారు. వారి ప్రవర్తనలోనూ మార్పులు కనిపిస్తుంటాయి. అటువంటి హెల్త్ కండిషన్స్ ట్రీట్ చేసేయొచ్చు. ఆ మార్పును పేరెంట్స్ ఫోకస్ పెడితే గమనించొచ్చు.