DSP : పోలీసులను చూసి పరుగులు తీసిన డీఎస్పీ

అతనో పోలీస్ ఉన్నతాధికారి.. కానీ పోలీసులను చూసే పరుగులు పెట్టాడు. తిరుచ్చి విమానాశ్రయం సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఓ కారు నుంచి భారీ నగదుతో డీఎస్పీ పరుగులు పెట్టాడు.

DSP : పోలీసులను చూసి పరుగులు తీసిన డీఎస్పీ

Dsp

అతనో పోలీస్ ఉన్నతాధికారి.. కానీ పోలీసులను చూసే పరుగులు పెట్టాడు. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు. తిరుచ్చి విమానాశ్రయం సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఓ కారు నుంచి రూ.11 లక్షలతో ఓ డీఎస్పీ పరుగులు తీయడం చర్చనీయాంశంగా మారింది.

తిరుచ్చి పుదుక్కొట్టై ప్రధాన రోడ్డు అయిన ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో వాహనాల తనిఖీ కేంద్రం ఉంది. అక్కడ గురువారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన ఓ కారును నిలిపి తనిఖీ చేస్తుండగా, కారులో నుంచి కిందకు దిగిన ఓ వ్యక్తి వేగంగా పరిగెత్తాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు.

పరిగెత్తిన వ్యక్తి డీఎస్పీ అని, స్నేహితులతో కలిసి రూ. 11 లక్షల నగదును తీసుకొని తిరుచ్చికి వచ్చినట్లు విచారణలో తెలిసింది. అనంతరం అతను మాట్లాడుతూ తనిఖీ కేంద్రంలో మఫ్టీలో ఉన్న పోలీసులను చూసి.. విజిలెన్స్‌ అధికారులు అనుకొని డబ్బుకు తగిన ఆధారాలు లేకపోవడంతో పరిగెత్తినట్లు పేర్కొన్నారు. దీంతో డీఎస్పీతో పాటు అతని ఇద్దరు స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు.