బిజీ బిజీ : జైల్లో కూడా ‘డేరా’వేసేశాడు ‘బాబా’

  • Published By: veegamteam ,Published On : April 21, 2019 / 04:44 AM IST
బిజీ బిజీ : జైల్లో కూడా ‘డేరా’వేసేశాడు ‘బాబా’

డేరా బాబా..డేరా బాబా హత్యలు..అక్రమాలు..వంటి పలు వివాదాస్పదాలతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి డేరా బాబు (గుర్మీత్ సింగ్) కు జైలు శిక్ష ఖారయ్యి శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడా డేరా బాబా జైల్లో కూడా ‘డేరా’ వేసేశాడు. 

హర్యానాలోని రోహ్తక్‌లోని   సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరాబాబా రామ్‌రహీం ‘నర్సరీ’ పనుల్లో బిజీ బిజీ అయిపోయాడు. జైల్లో ఉన్న ఖౌదీలు ఏదోక పనిచేయాలి కాబట్టి డేరా బాబా ఇతర ఖైదీలతో కలిసి ఓ నర్సరీ స్టార్ట్ చేశారు. ఎన్నో రకాల మొక్కల్ని పెంచుతున్నాడు. వీరు పెంచుతున్న ఈ మొక్కలను హర్యానా రాష్ట్రంలోని అన్ని జైళ్లకు పంపిస్తున్నారు అధికారులు.  సునారియా జైలులోని ఖైదీలు బంగాళదుంప, వంకాయితో పాలు పలు రకాల కూరగాయల మొక్కలను, పూల మొక్కలను పెంచుతున్నారు. వీటిని జైలు అధికారులు ఇతర జైళ్లకు పంపించి అక్కడ కూడా వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. 
 

ఒక విలేకరి హత్య..సాధ్వీలపై అత్యాచారం..ఆశ్రమంలో 600ల అస్థిపంజరాలు వెలుగులోకి రావటం..వంటి లెక్కలేనన్ని కేసుల విషయంలో 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.  ఈ క్రమంలో గత మూడు నెలలుగా డేరాబాబా తోటి ఖైదీలతో కలసి వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జైలులోని 10 ఎకరాల్లో పూలతో పాటు వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కలను పానీపట్, భివానీ, ఇజ్జర్, కురుక్షేత్ర తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదిలావుండగా జైలులోని మరికొందరు ఖైదీలు ఫర్నీచర్ కూడా తయారు చేస్తున్నారు. ఈ ఫర్నీచర్‌ను వివిధ పాంత్రాలకు తరలించి విక్రయిస్తున్నారు. ఏది ఏమైనా డేరా బాబా జైల్లో కూడా తన మార్క్ ను కనబరుస్తున్నారు.