తండ్రి ఆశయ సాధనే లక్ష్యం : బీజేపీ చివాట్లు పెట్టినా.. పట్టువదలని చంద్ర కుమార్ బోస్!

  • Published By: sreehari ,Published On : January 23, 2020 / 02:31 AM IST
తండ్రి ఆశయ సాధనే లక్ష్యం : బీజేపీ చివాట్లు పెట్టినా.. పట్టువదలని చంద్ర కుమార్ బోస్!

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముని మేనల్లుడు, బిజెపి ఉపాధ్యక్షుడు, చంద్రకుమార్ బోస్ తన తండ్రి అమియా నాథ్ బోస్ స్థాపించిన ‘అజాద్ హింద్ సంఘ్’ ను పునరుద్ధరించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసన గళం వినిపించిన ఆయన ప్రజాస్వామ్య దేశంలో పౌరులపై చట్టాలను బలవంతంగా రుద్దరాదని గట్టిగా వాదించారు. కానీ, దీనిపై బీజేపీ ఆయనకు చివాట్లు పెట్టింది.. ఈ క్రమంలో బీజేపీ సముఖంగా లేకపోవడంతో తన తండ్రి 1971లో స్థాపించిన సంఘాన్ని తిరిగి పునస్థాపించే కార్యక్రమాన్ని చంద్రబోస్ మొదలుపెట్టారు. అమియా నాథ్ బోస్.. సారత్ చంద్రబోస్ తండ్రి. సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు కూడా.. ఈయన 1971లో ‘అజాద్ హింద్ సంఘ్’ సంస్థను స్థాపించారు. అప్పట్లో ఆయన లోక్ సభ ఎంపీగా కూడా పనిచేశారు. అమియా నాథ్ బోస్ కుమారుడు చంద్ర కుమార్ బోస్.. తన తండ్రి ఆశయాన్ని కొనసాగించాలని పట్టుబట్టారు. 

పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా ఒక లౌకిక నేతగా పేర్కొన్న చంద్రబోస్.. కాంగ్రెస్‌లో వారిగా కాకుండా బీజేపీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన తండ్రి స్థాపించిన సంస్థను పునరుద్ధరించడంలో బీజేపీ ఆసక్తి చూపడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘బీజేపీ నేను చేరినప్పుడే పార్టీలోని సీనియర్ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ తో  నేతాజీ ఆదర్శాలపై ప్రస్తావించాను. నేతాజీ ఆదర్శాలకు అనుగుణంగా పనిచేసేలా అనుమతి ఇస్తేనే పార్టీలో చేరుతానని కూడా చెప్పాను’ అని బోస్ తెలిపారు. 

అజాద్ హింద్ మోర్చా యూత్ విభాగం ద్వారా పార్టీ కోసం పనిచేస్తానని బీజేపీ నేతలతో అప్పుడే చెప్పానని అన్నారు. బీజేపీలో ఇలాంటి మోర్చాలు ఎన్నో ఉన్నాయని, అందుకే నేతాజీ విజన్ ద్వారా అజాద్ హింద్ మోర్చా యూత్ వింగ్ ను ముందుకు కచ్చితంగా తీసుకెళ్లగలనని విశ్వసిస్తున్నానని చంద్ర కుమార్ బోస్ తెలిపారు. ఈ ప్లాన్ పై ప్రారంభంలో బోస్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో బీజేపీ నేతలు అంగీకరించినప్పటికీ తర్వాత స్పందించడం మానేశారు. దీంతో తన సంస్థ పేరుతో అజాద్ అనే పేరును తొలగించి ‘జై హింద్ మోర్చా యూత్ వింగ్’ అని మారుస్తానని కూడా సూచించినట్టు తెలిపారు. 

అజాద్.. అజాదీ అనే పదాలు వివాదాస్పదమైనవి తాను కూడా అంగీకరిస్తున్నానని కూడా ఒకానొక సందర్భంలో చంద్రబోస్ స్పష్టం చేశారు. అయినప్పటికీ బీజేపీ తన ప్రతిపాదనపై ఆసక్తి చూపకపోవడంతో ఆయన అసహనానికి గురినట్టుగా తెలిపారు. అందుకే సొంతంగా తానే అజాద్ హింద్ సంఘా పేరుతో సంస్థను పునరుద్ధరించనున్నట్టు తెలిపారు. బీజేపీలో సీనియర్ నేతల్లో అమిత్ షా, నరేంద్ర మోడీలా తాను కూడా ఒకడినని ఆయన అన్నారు. పార్టీలో కొనసాగాలని భావిస్తే నేను బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ, అజాద్ హింద్ మోర్చా యూత్ వింగ్ ఏర్పాటుకు సంబంధించి అంశాలపై మోడీతో మాట్లాడేందుకు అపాయింట్ మెంట్ కోసం చూస్తున్నానని తెలిపారు. జనవరి 23న నేతాజీ పుట్టినరోజు కావడతో అదే రోజును ‘నేషనల్ పాట్రియాటిక్ డే’ గా ప్రకటించాలని కోరుతానని చంద్ర కుమార్ బోస్ తెలిపారు.