#IndependenceDay: మోదీ గోల్.. 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్

వందేళ్ల స్వాతంత్ర్యం నాటికి ఐదు ప్రతిజ్ణల్ని నెరవేరుస్తామని మోదీ హామీ ఇచ్చారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్, బానిసత్వ చిహ్నాల్సేవీ లేకుండా రూపుమాపడం, వారసత్వ సంపదపై గర్వం, ఐక్యత, ప్రస్తుతం ముందున్న బాధ్యతల్ని నెరవేర్చడం.. ఈ ఐదు ప్రతిజ్ణల్ని ఈరోజు చేస్తున్నట్లు, వచ్చే 25 ఏళ్ల నాటికి వీటిని 100 శాతం నెరవేర్చేలా పని చేస్తానని, చేయాలని ప్రధాని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ద్రౌపది ముర్ము సైతం తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు.

#IndependenceDay: మోదీ గోల్.. 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్

Developed nation in 25 years says pm modi

#IndependenceDay: వచ్చే 25 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్వాతంత్ర్య దినోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటోంది. మరో 25 ఏళ్లు అంటే, దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేర్చడాన్ని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎర్రకోట మీద నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ 2047 నాటికి (100 ఏళ్ల స్వాతంత్ర్యం) గాంధీ, నేతాజీ, బాబాసాహేబ్ కలలను సాకారం చేస్తామని అన్నారు.

వందేళ్ల స్వాతంత్ర్యం నాటికి ఐదు ప్రతిజ్ణల్ని నెరవేరుస్తామని మోదీ హామీ ఇచ్చారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్, బానిసత్వ చిహ్నాల్సేవీ లేకుండా రూపుమాపడం, వారసత్వ సంపదపై గర్వం, ఐక్యత, ప్రస్తుతం ముందున్న బాధ్యతల్ని నెరవేర్చడం.. ఈ ఐదు ప్రతిజ్ణల్ని ఈరోజు చేస్తున్నట్లు, వచ్చే 25 ఏళ్ల నాటికి వీటిని 100 శాతం నెరవేర్చేలా పని చేస్తానని, చేయాలని ప్రధాని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ద్రౌపది ముర్ము సైతం తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు.

సోమవారం ఉదయం రాజ్‭ఘాట్ సందర్శనతో స్వాతంత్ర్య వేడుకల్ని ప్రధాని ప్రారంభించారు. అక్కడి నుంచి నేరుగా ఎర్రకోటకు వచ్చి జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతుండడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ఇప్పటికే ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిటి రెండేళ్ల సుదీర్ఘ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దేశంలోని ప్రఖ్యాత, చారిత్రక కట్టడాలు, భవనాలను త్రివర్ణ శోభమయం చేశారు.

#IndependenceDay: ఈసారి ప్రసంగంలో టెలిప్రాంప్టర్ కాకుండా పేపర్ నోట్స్ వాడిన మోదీ