ఛత్‌ పూజ: విషపూరిత నురుగులో పూజలు చేస్తున్న మహిళలు

  • Published By: veegamteam ,Published On : November 4, 2019 / 06:40 AM IST
ఛత్‌ పూజ: విషపూరిత నురుగులో పూజలు చేస్తున్న మహిళలు

దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ చాలా ప్రమాదకర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ప్రజలు గాలి పీల్చుకోవడానికి కూడా భయపడుతున్నారు. అయితే దేశంలో కాలుష్యం ఏ స్థాయిలో పెరుగుతుందో చెప్పడానికి అక్కకడ మహిళలు చేసిన ఛత్‌ పూజ ఫోటోలను చూస్తే మీకే అర్ధమౌతోంది.

ఛత్‌ పూజ అంటే వేకువ జామునే నది వద్దకు చేరుకుని.. సూర్యుడు ఉదయించే వరకు పూజలు చేసి.. సూర్యదేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. అయితే ఇందులో భాగంగా ఈసారి యమునా నది ఒడ్డున ఉన్న విషపూరిత నురుగులో నిలబడి మహిళలు పూజలు చేశారు.

ఈ విషపు నురగ వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందనే అవగాహన లేక చాలా మంది అందులో దిగి తమ భక్తిని చాటుకున్నారు. మరికొంత మంది ఏది ఏమైనా పూజ చేసి తీరాలని విషపు నురగను లెక్కచేయకుండా అందులోకి దిగి పూజలు ముగించుకున్నారు.

అయితే ఆ నురుగులో నించుని పూజలు చేస్తున్న మహిళల ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫొటోలు చూసిన వారు మహిళలు తెల్లని మబ్బుల మధ్య నిల్చోని పూజ చేస్తున్నారమోనని అనుకుంటున్నారు. కానీ వారు విషపూరితమైన నురుగులో నించుని సూర్యదేవుడికి పూజ చేస్తున్నారని తెలియటం లేదు.