Sabarimala : రెండేళ్ల తర్వాత తెరచుకున్న శబరిమల పెద్దపాదం మార్గం.. నేటి నుంచి భక్తులకు అనుమతి

శబరిమలలో మండలకాల ఉత్సవం తరువాత గురువారం సాయంత్రం నుంచి ఆలయం తిరిగి తెరుచుకుంది. నిన్న ఉదయం 5 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు.

Sabarimala : రెండేళ్ల తర్వాత తెరచుకున్న శబరిమల పెద్దపాదం మార్గం.. నేటి నుంచి భక్తులకు అనుమతి

Sabarimala

Sabarimala Paddapadam margam : రెండేళ్ల తర్వాత శబరిమల పెద్దపాదం మార్గం తెరచుకుంది. ఇవాళ్టి నుంచి భక్తులను ఈ మార్గంలో అనుమతించారు. ఎరుమేలి నుంచి ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 10.30 మధ్య ఈ మార్గంలో ప్రయాణించవచ్చు. నీలక్కల్‌, ఎరుమేలి వద్ద దర్శనం కోసం స్పాట్‌ బుకింగ్‌కు అవకాశముంది. వర్చువల్‌ క్యూపద్ధతిలో దర్శనం కోసం టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు స్లాట్‌ నిర్ధారణ టికెట్‌తోపాటు రెండు డోసుల టీకా ధ్రువీకరణ లేదా ఆర్‌టీపీసీఆర్‌ నెగెటివ్‌ ఫలితం తాలూకు పత్రాలు వెంట తీసుకెళ్లాలి.

మకరజ్యోతి దర్శనం జనవరి 14న ఉంటుంది. హరివరాసనం తరువాత జనవరి 19న దేవాలయాన్ని మూసివేస్తారు. ఎరుమేలి, అలుద, కరిమల, పెరియనపట్టం, పంబ ప్రాంతాల్లో అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సమాచార కేంద్రం, అన్నదాన సేవలను భక్తులు వినియోగించుకోవాలని దేవస్థాన బోర్డు సూచించింది.

PM Kisan Funds : నేడు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ నిధులు జమ.. 10 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి

శబరిమలలో మండలకాల ఉత్సవం తరువాత గురువారం సాయంత్రం నుంచి ఆలయం తిరిగి తెరుచుకుంది. నిన్న ఉదయం 5 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. ప్రతిరోజూ వేకువజామున 4 గంటలకు ఆలయాన్ని తెరిచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి దర్శనానికి అనుమతించి హరివరాసనం తరువాత రాత్రి 10 గంటలకు మూసివేస్తున్నారు.