International Flights : అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

కరోనా నేపధ్యంలో అంతర్జాతీయ విమానాల‌పై నిషేధాన్ని మరోసారి భారత్ పొడగించబడింది.

International Flights : అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

Flights

International Flights కరోనా నేపధ్యంలో అంతర్జాతీయ విమానాల‌పై నిషేధాన్ని మరోసారి భారత్ పొడగించబడింది. కరోనావైరస్ మహమ్మారి మధ్య అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాల సస్పెన్షన్ చివరిసారిగా జూన్ 30 వరకు పొడిగించబడింది. నేటితో ఈ గడువు ముగియనున్న నేపథ్యంలో…అంత‌ర్జాతీయ‌ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని జూలై 31వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు ఇండియన్ ఏవియేషన్ రెగ్యులేటరీ.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించని స్పష్టం చేసింది.

కాగా, కోవిడ్ వైరస్ కారణంగా గతేడాది మార్చిలో అంతర్జాతీయ కమర్షియల్‌, ప్యాసింజర్‌ విమానాలపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే గతేడాది మే నుంచి వందే భారత్‌ మిషన్‌ పేరుతో వివిధ దేశాలకు విమానాలు నడిపి, అక్కడ కోవిడ్ కారణంగా చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి చేర్చింది. గతేడాది జూలై నుంచి ఎంపిక చేసిన దేశాలతో ద్వైపాక్షిక “ఎయిర్ బబుల్” ఏర్పాట్ల కింద విమానాలు నడుస్తున్నాయి. అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా 27 దేశాలతో భార‌త్‌ ఎయిర్ బబుల్‌లో భాగంగా ఒప్పందాలు చేసుకుంది.