Simple Marriage : ఆమె మెజిస్ట్రేట్‌, అతను ఆర్మీ మేజర్‌.. వారి పెళ్లి ఖర్చు రూ.500

పెళ్లంటే జీవితంలో ఒకసారి జరిగే మధురమైన వేడుక.. ఈ వేడుకను చాలామంది అంగరంగ వైభవంగా జరుపుకోడానికే ఇష్టపడతారు. ఇందుకోసం వెనకాముందు చూడకుండా ఖర్చు చేస్తారు. తమ పెళ్లి అందరికంటే గ్రాండ్ గా జరగాలని కోరుకుంటారు. స్పెషల్ వంటకాలతో పెళ్లి మండపాన్ని గుమగుమలాడిస్తారు. అయితే ఎలాంటి అంగుఆర్భాటం లేకుండా ఇద్దరు ఉన్నతస్థాయి ఉద్యోగులు పెళ్లి చేసుకున్నారు. రూ.500 లతోనే పెళ్లి తంతు పూర్తీ చేశారు.

Simple Marriage : ఆమె మెజిస్ట్రేట్‌, అతను ఆర్మీ మేజర్‌.. వారి పెళ్లి ఖర్చు రూ.500

Simple Marriage

Simple Marriage : పెళ్లంటే జీవితంలో ఒకసారి జరిగే మధురమైన వేడుక.. ఈ వేడుకను చాలామంది అంగరంగ వైభవంగా జరుపుకోడానికే ఇష్టపడతారు. ఇందుకోసం వెనకాముందు చూడకుండా ఖర్చు చేస్తారు. తమ పెళ్లి అందరికంటే గ్రాండ్ గా జరగాలని కోరుకుంటారు. స్పెషల్ వంటకాలతో పెళ్లి మండపాన్ని గుమగుమలాడిస్తారు. అయితే ఎలాంటి అంగుఆర్భాటం లేకుండా ఇద్దరు ఉన్నతస్థాయి ఉద్యోగులు పెళ్లి చేసుకున్నారు. రూ.500 లతోనే పెళ్లి తంతు పూర్తీ చేశారు.

వివరాల్లోకి వెళితే..మహారాష్ట్రలోని దార్ జిల్లాకు చెందిన అంకిత్‌ చతుర్వేది ఆర్మీలో మేజర్ గా పనిచేస్తున్నారు, శివంగి ధార్ జిల్లాలో సిటి మెజిస్ట్రేట్‌ విధులు నిర్వహిస్తున్నారు. వీరు తాజాగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇందుకోసం కేవలం రూ.500 మంత్రమే ఖర్చు చేశారు. ఈ ఐదు వందలను పెళ్ళికి వచ్చిన వారికి స్వీట్స్ పంచేందుకు ఖర్చు చేశారు.

నెలకు లక్షల్లో జీతం తీసుకునే వీరు ఇలా వివాహం చేసుకోవడం అందరిని ఆశ్చర్యనికి గురి చేస్తుంది. ఇక వీరికి సంబందించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంట నేటి యువతకు ఆదర్శం అని కొందరు అంటే కరోనా వేళ మంచి నిర్ణయం తీసుకున్నారని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

కాగా అంకిత్‌ చతుర్వేది, శివంగిల వివాహం రెండు సంవత్సరాల క్రితం నిశ్చయమైంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే రిజిస్టర్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వివాహం అనంతరం శివంగి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా ఇంకా పూర్తిగా అంతమవలేదని, ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించాలని అన్నారు. “వివాహానికి విపరీతంగా ఖర్చు చేయడం మాకు నచ్చలేదని, అందుకే మేమే ఇలా చేసుకున్నట్లు” ఆమె తెలిపారు.