Dharam Sansad Row : విద్వేష ప్రసంగాలపై సీజేఐకి 76మంది లాయర్ల లేఖ

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లోని వేద్ నికేతన్ ధామ్ లో యతి నరసింహానంద్ గిరి నేతృత్వంలో జునా అఖాడా డిసెంబర్ 17-20 మధ్యలో మూడు రోజుల పాటు నిర్వహించిన “ధర్మ సంసద్” లో పాల్గొన్న

Dharam Sansad Row : విద్వేష ప్రసంగాలపై సీజేఐకి 76మంది లాయర్ల లేఖ

Cji

Lawyers Write To CJI :  ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లోని వేద్ నికేతన్ ధామ్ లో యతి నరసింహానంద్ గిరి నేతృత్వంలో జునా అఖాడా డిసెంబర్ 17-20 మధ్యలో మూడు రోజుల పాటు నిర్వహించిన “ధర్మ సంసద్” లో పాల్గొన్న పలువురు చేసిన విద్వేష ప్రసంగాల వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కొన్ని వర్గాల వారిపై దాడులు చేయాలని రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ఓ వర్గంవారిపై దాడి చేయాలని, ఆయుధాలతో అందుకు సిద్ధం కావాలని, మాజీ ప్రధానిని చంపాలని పలువురు ప్రసంగించినట్లు ఆ వీడియోలలో కనిపిస్తోంది.

అయితే ఓ వర్గంపై మారణహోమం సృష్టించాలని పిలుపునిస్తూ హరిద్వార్ తో పాటు ఇటీవల ఢిల్లీలో హిందూ యువవాహిని నిర్వహించిన కార్యక్రమంలో కూడా పలువురు చేసిన విద్వేష ప్రసంగాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణకు 76 మంది సుప్రీంకోర్టు లాయర్లు ఆదివారం ఓ లేఖ రాశారు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా పరిగణించాలని సీజేఐని లాయర్లు కోరారు దేశంలో ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని,విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వ్యక్తులపై చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ఆ లేఖలో లాయర్లు పేర్కొన్నారు. పట్నా హైకోర్టు మాజీ జడ్జి అంజునా ప్రకాశ్​తో పాటు న్యాయవాదులు దుశ్యంత్​ దవే​, ప్రశాంత్​ భూషణ్​, బృందా గ్రోవర్​, మీనాక్షి ఆరోరా, సల్మాన్​ ఖుర్షిద్​ తదితరులు లేఖపై సంతకం చేశారు.

లేఖలో లాయర్లు
సీజేఐ కి రాసిన లేఖలో…”ఆయా కార్యక్రమాల్లో చేసిన ప్రసంగాలు కేవలం విద్వేషపూరితమైనవి మాత్రమే కాదు. ఒక వర్గం మొత్తాన్నే హత్య చేయాలని పిలుపునిచ్చారు. దేశ ఐకమత్యానికి, లక్షలాది మంది ముస్లింలకు ఆ ప్రసంగాలు ముప్పు పొంచి ఉంది. సంబంధిత వ్యక్తులపై 120బీ, 121ఏ, 153ఏ, 153బీ, 295ఏ, 298 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. గతంలోనూ ఇలాంటి ప్రసంగాలు మనం విన్నాం. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి ప్రసంగలు ఇప్పుడు సాధారణమైపోయాయి. ఈసారి అలా జరగకూడదు. న్యాయవ్యవస్థ సత్వరమే జోక్యం చేసుకోవాలి. సీజేఐగా మీరు మీ సామర్థ్యాన్ని ఉపయోగించి చర్యలు చేపడతారని ఆశిస్తున్నాము” అని ఆ లేఖలో లాయర్లు పేర్కొన్నారు.

ALSO READ Dharma Sansad : హరిద్వార్ ఈవెంట్ లో విద్వేష ప్రసంగంపై రాహుల్,ప్రియాంక ఫైర్