Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్విస్ట్.. ఓటింగ్‌లో అక్రమాలు జరిగాయన్న థరూర్ వర్గం.. ఎన్నికల అధికారులు ఏమన్నారంటే..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓటింగ్ ప్రక్రియ సందర్భంగా అక్రమాలు జరిగాయంటూ శశిథరూర్ వర్గం ఆరోపణలను ఎన్నికల అధికార వర్గాలు కొట్టిపారేశాయి. అవికేవలం పనికిమాలిన ఆరోపణలు అంటూ పేర్కొన్నాయి. ఇద్దరు అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్ల సమ్మతం మేరకు బ్యాలెట్ బాక్స్‌లు సీల్ చేయడం జరిగిందని, వారు బాక్సులపై సంతకం చేయడమే కాకుండా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించినందుకు రిటర్నింగ్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారని ఎన్నికల అధికార వర్గాలు తెలిపాయి.

Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్విస్ట్.. ఓటింగ్‌లో అక్రమాలు జరిగాయన్న థరూర్ వర్గం.. ఎన్నికల అధికారులు ఏమన్నారంటే..

Congress President Election

Congress President Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రకియ జరుగుతుంది. మరికొద్ది సేపట్లో అధ్యక్ష పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారోనన్న ఉత్కంఠకు తెరపడనుంది. ఈ సమయంలో శశిథరూర్ వర్గం సంచలన ఆరోపణలు చేసింది. ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరగలేదని, అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ పేర్కొంది. ఈ మేరకు శశిథరూర్ వర్గం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ లేఖ రాశారు. కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, ఆ రాష్ట్రాల్లో ఓట్లను పరిగణలోకి తీసుకోవద్దని డిమాండ్ చేశారు.

Congress President Election: ఖర్గేనా? శశి థరూరా?.. కాంగ్రెస్ అధ్యక్ష పీఠమెక్కేదెవరో తేలేది నేడే.. ఫలితాలు ఏ సమయానికొస్తాయంటే..

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఫిర్యాదుతో థరూర్ శిబిరం ఎన్నికల అధికార యంత్రాంగాన్ని ఆశ్రయించింది. పీసీసీ ప్రతినిధులు అత్యధికంగా ఉన్న ఉత్తరప్రదేశ్ సహా మూడు రాష్ట్రాల్లో అక్రమాలు జరిగాయని థరూర్ శిబిరం పేర్కొన్నట్లు సమాచారం. అధికార యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులకు సీలు వేయలేదని థరూర్ శిబిరం పేర్కొంది. రెండు రాష్ట్రాల్లో, ఓటింగ్ రోజున రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు కొంతమంది పిసిసి ప్రతినిధులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారని, థరూర్ ప్రత్యర్థి మల్లికార్జున్ ఖర్గేకు ఓటు వేయాలని బహిరంగంగా కోరారని థరూర్ శిబిరం పేర్కొంది.

అయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓటింగ్ ప్రక్రియ సందర్భంగా అక్రమాలు జరిగాయంటూ శశిథరూర్ వర్గం ఆరోపణలను ఎన్నికల అధికార వర్గాలు కొట్టిపారేశాయి. అవికేవలం పనికిమాలిన ఆరోపణలు అంటూ పేర్కొన్నాయి. ఇద్దరు అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్ల సమ్మతం మేరకు బ్యాలెట్ బాక్స్‌లు సీల్ చేయడం జరిగిందని, వారు బాక్సులపై సంతకం చేయడమే కాకుండా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించినందుకు రిటర్నింగ్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారని ఎన్నికల అధికార వర్గాలు తెలిపాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

సంప్రదించినప్పుడు, థరూర్ ప్రచారంలో కీలక సభ్యుడు సల్మాన్ అనీస్ సోజ్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ , “ఈ ప్రచారమంతా మేము ఎన్నికల నిర్వహణ గురించి ఎన్నికల అధికారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాము మరియు ఎన్నికల రోజున మేము అలా చేసాము మరియు నిజానికి మేము ఎన్నికల రోజు తర్వాత చేసాము…అంటే ఈరోజు మేము మా ఆందోళనలను ఎన్నికల అధికారికి తెలియజేసాము. ఇప్పుడు అది ఎన్నికల అధికారంపై ఆధారపడి ఉందని సోజ్ తెలిపారు. కాగా, బుధవారం ఓట్ల లెక్కింపు కోసం దేశవ్యాప్తంగా ఉన్న బ్యాలెట్ బాక్సులను ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. గోప్యత కోసం బ్యాలెట్ పత్రాలు కలపబడతాయి.

ఇదిలాఉంటే.. థరూర్ శిభిరంలో కీలక సభ్యుడు సల్మాన్ అనీస్ సోజ్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మేము ఎన్నికల అధికారులకు ఈ రోజు ఫిర్యాదు చేయలేదని, పోలింగ్ రోజు, తరువాత రోజు అక్రమాలు జరిగాయని తెలిపామని అన్నారు. మేము మా ఆందోళనలను ఎన్నికల అధికారికి తెలియజేశామని, ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఎన్నికల అధికారిపై ఆధారపడి ఉంటుందని సోజ్ అన్నారు.