DHFL Scam : దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్కామ్..DHFL​లో​ రూ.34,615 కోట్ల అవినీతి | DHFL Scam

DHFL Scam : దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్కామ్..DHFL​లో​ రూ.34,615 కోట్ల అవినీతి

దేశంలో బ్యాంకింగ్‌ రంగంలోనే అతిపెద్ద కుంభకోణం బయటపడింది. 17 బ్యాంకులను నిండా ముంచిన ముగ్గురు వ్యాపారవేత్తలు ఏకంగా..రూ.34,615 కోట్ల స్కామ్ చేసినట్లుగా సీబీఐ దర్యాప్తులో తేలింది. దీనికి సంబంధించి DHFL‌ సంస్థ మాజీ సీఎండీ కపిల్‌ వాధ్వాన్‌, డైరెక్టర్‌ ధీరజ్‌ వాధ్వాన్‌, ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసింది.

DHFL Scam : దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్కామ్..DHFL​లో​ రూ.34,615 కోట్ల అవినీతి

DHFL scam: భారత్ బ్యాంక్ లో స్కాములు గురించి వింటుంటాం. కానీ ఈ డీహెచ్‌ఎఫ్‌ఎల్ బ్యాంక్ లో జరిగింది మాత్రం అలాంటిలాంటి స్కామ్ కాదు. దిమ్మ తిరిగిపోయే స్కామ్ తో దేశంలో బ్యాంకింగ్‌ రంగంలోనే అతిపెద్ద కుంభకోణం బయటపడింది. ఇండియాలో ఇప్పటికే బ్యాంకులకు కోట్లకు కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాల్లో తలదాచుకున్న వ్యాపారవేత్తల లిస్ట్ చాలా చాలా పెద్దదే. ఈ లిస్టులో మరో బిగ్గెస్ట్ మోసం వెలుగులోకి వచ్చింది.17 బ్యాంకులను నిండా ముంచిన ముగ్గురు వ్యాపారవేత్తలు రూ.100,200ల కోట్లు కాదు..ఏకంగా..రూ.34,615 కోట్ల బ్యాంకు మోసానికి సంబంధించి దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (DHFL‌), ఆ సంస్థ మాజీ సీఎండీ కపిల్‌ వాధ్వాన్‌, డైరెక్టర్‌ ధీరజ్‌ వాధ్వాన్‌, ఇతరులపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కేసు నమోదు చేసింది. సీబీఐ దర్యాప్తు చేపట్టిన అతిపెద్ద కుంభకోణం ఇదేనని బుధవారం (6,2022) అధికారులు పేర్కొన్నారు. ఈ బ్యాంకు మోసాల గురించి ఇన్నాళ్లు ఎదురు చూసిన సీబీఐ ఇప్పుడు పక్కా ఆధారాలతో రంగలోకి దిగింది. మాజీ సీఎండీ కపిల్‌ వాధ్వాన్‌, డైరెక్టర్‌ ధీరజ్‌ వాధ్వాన్‌, ఇతరులపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కేసు నమోదు చేసింది.

Also read : NIA Searches: హైకోర్టు అడ్వకేట్ శిల్పను అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ.. స్టూడెంట్ మిస్సింగ్ కేసుపై ఆరా..

జూన్ 20న కేసు నమోదయిన క్రమంలో బుధవారం ముంబయిలో ఒకేసారి 12 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్లున్న వారిలో అమిలిస్‌ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్‌ షెట్టితో పాటు..మరో ఎనిమిది మంది బిల్డర్లు కూడా ఉన్నారు. 2010-18 మధ్య యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలో 17 బ్యాంకుల కన్సార్షియం రూ.42,871 కోట్ల విలువైన రుణాలను తీసుకుని దుర్వినియోగం చేసినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. వీటికి సంబంధించి యూనియన్‌ బ్యాంక్‌ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలోనే సీబీఐ విచారణ చేపట్టింది. కపిల్‌, ధీరజ్‌లు నిజాల్ని కప్పిపుచ్చుతూ.. విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని, 2019 మే నుంచి రుణ చెల్లింపులను ఎగవేస్తూ రూ.34,614 కోట్ల మేర ప్రజా ధనాన్ని మోసం చేశారని, కుట్రపూరితంగా ప్రవర్తించారని బ్యాంకు ఆరోపించింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఖాతా పుస్తకాలపై ఆడిట్‌లోనూ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని..నిధులను మళ్లించారని..పుస్తకాల్లో గణాంకాలను మార్చారని, తద్వారా కపిల్‌, ధీరజ్‌లు సొంత ఆస్తులు పెంచుకున్నారని.. ఇదంతా ప్రజా ధనంతో చేశారని ఆరోపణలు చేసింది. వీరిద్దరూ అంతక్రితం ఉన్న మోసపూరిత కేసుల్లో జ్యుడీషియల్‌ కస్టడీలోనే ఉన్నారు.

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మోసాలు 2019 జనవరి నుంచి వెలుగులోకి రావడం మొదలైంది. ఈ సంస్థ నిధులు మళ్లిస్తోందంటూ ప్రసార మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై ‘ప్రత్యేక ఆడిట్‌’ నిర్వహించాలంటూ కేపీఎమ్‌జీ సంస్థను 2019 ఫిబ్రవరి 1న బ్యాంకులు నియమించాయి. 2015 ఏప్రిల్‌ 1 – 2018 డిసెంబరు మధ్యకాలానికి, ఆ సంస్థ ఖాతా పుస్తకాలపై సమీక్ష నిర్వహించాలని కేపీఎమ్‌జీని అప్పట్లో కోరాయి. కపిల్‌, ధీరజ్‌ వాధ్వాన్‌లు దేశం విడిచిపెట్టకుండా ఉండేందుకు 2019 అక్టోబరు 18న ‘లుక్‌అవుట్‌ సర్క్యులర్‌’లను బ్యాంకులు జారీ చేశాయి.ఆడిట్‌లో ఇవి బయటపడ్డాయి: కేపీఎమ్‌జీ నిర్వహించిన ఆడిట్‌లో.. రుణాలు, అడ్వాన్సులు పొందిన తర్వాత డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన సంస్థలు, వ్యక్తులు, డైరెక్టర్ల ఖాతాలకు నిధుల మళ్లింపు జరిగిందని తేలినట్లు యూనియన్‌ బ్యాంకు పేర్కొంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లకు రూ.29,100 కోట్ల మేర పంపిణీ జరిగినట్లు తెలుస్తుంది. వీటికి సంబంధించి, ఇప్పటివరకు రూ.29,849 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఇందులో చాలా వరకు లావాదేవీలు భూములు, ఆస్తుల రూపంలో పెట్టుబడులు పెట్టినట్లు బ్యాంకు ఖాతా పుస్తకాల పరిశీలనలో తేలినట్లు వివరించింది. చాలా వరకు సందర్భాల్లో రుణాలిచ్చిన నెలరోజుల్లోనే ఆ నిధులు సుధాకర్‌ షెట్టికి చెందిన కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో మళ్లినట్లు తేలింది. రూ.వందల కోట్ల చెల్లింపులకు సంబంధించిన వివరాలు బ్యాంకు స్టేట్‌మెంట్లలో కనిపించలేదు. రుణాల అసలు, వడ్డీలపై సహేతుకం కాని రీతిలో మారటోరియం కనిపించింది. పలు సందర్భాల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, తన ప్రమోటర్లకు భారీ ఎత్తున నిధులను పంపిణీ చేసింది. వాటిని తమ ఖాతా పుస్తకాల్లో రిటైల్‌ రుణాలుగా పేర్కొన్నారు.

Also read : Gali Janardhan Reddy: నేను అనుకుంటే ఒక్క రోజైనా సీఎంను అవుతా..

రూ.14,000 కోట్ల గల్లంతు: ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ కింద రూ.14,000 కోట్లు ఇచ్చినట్లు చూపారు. ఇందు కోసం 1,81,664 మందికి రిటైల్‌ రుణాలు ఇచ్చినట్లు తప్పుగా సృష్టించారు. ఇవ్వని రుణాల విలువ రూ.14,095 కోట్లుగా తేలింది. తరుచుగా.. ‘బాంద్రా బుక్స్‌’ పేరుతో రుణాలను పేర్కొంటూ..వాటికి విడిగా డేటాబేస్‌ నిర్వహించారు. అనంతరం వాటన్నింటినీ ‘అదర్‌ లార్జ్‌ ప్రాజెక్ట్‌ లోన్స్‌’ (OLPL‌)లో విలీనం చేశారు. కాగా..కంపెనీకి చెందిన గృహ రుణాలు, ప్రాజెక్టు రుణాల హామీలు, ప్రమోటర్ల వాటా అమ్మకం తదితరాల ద్వారా కంపెనీపై ఒత్తిడి తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎప్పటికప్పుడు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఆ కంపెనీ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌లు చెబుతూ వచ్చారు. 2019 మే నుంచి రుణాల చెల్లింపులు, వడ్డీలను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఆలస్యం చేస్తూ వచ్చింది. ఆ తర్వాత నిరర్థక ఆస్తులుగా కంపెనీ ఖాతాలను ప్రకటించారు.

×