సచిన్ లాగే ధోనీని కూడా ఎత్తుకొని తిరగాలి 

  • Published By: bheemraj ,Published On : June 28, 2020 / 12:50 PM IST
సచిన్ లాగే ధోనీని కూడా ఎత్తుకొని తిరగాలి 

వాంఖడే స్టేడియంలో 2011 వన్డే ప్రపంచకప్ లో గెలిచాక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టీమిండియా ప్లేయర్లు భుజాలపై ఎత్తుకొని ఎలా తిరిగారో…అలాగే ధోనీని కూడా టీ20 ప్రపంచకప్ తర్వాత ఎత్తుకొని తిరగాలని క్రికెటర్ శ్రీశాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏడాది నుంచి క్రికెట్ కు దూరమైన మహీ భవితవ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడు రిటైర్డ్ కావాలని కొందరు కోరుకుంటుండగా, మరి కొందరు ఇంకా ఆడాలని ఆశిస్తున్నారు. అలా ధోనీ ఆడాలనుకుంటున్న వారిలో శ్రీశాంత్ కూడా ఒకరు ఉన్నారు. తాజాగా క్రికెట్ అడిక్టర్ అనే కార్యక్రమంలో మాట్లాడిన కేరళ పేసర్ వచ్చే టీ20 ప్రపంచకప్ లో మాజీ సారథి ఆడాలని ఆకాంక్షించాడు.

మహీ భాయ్ కచ్చితంగా పొట్టి ప్రపంచకప్ ఆడాలి. ఆ మెగా ఈవెంట్ కన్నా ముందే ఐపీఎల్ జరుగుతుందని కచ్చితంగా ఆకాంక్షిచాడు. మహీ భాయ్ కచ్చితంగా పొట్టి ప్రపంచప్ ఆడాలి. ఆ మెగా ఈవెంట్ కన్నా ముందే ఐపీఎల్ జరుగుతుందని కచ్చితంగా భావిస్తున్నా. దీంతో అతడి బ్యాటింగ్ చూసే అదృష్టం మనకు కలుగుతుంది. ఎందుకంటే అతడి రిటైర్ మెంట్ పై అనేక మంది మాట్లాడుకుంటున్నారు. అయినా అతను మౌనంగానే ఉన్నాడు. ఏం చేయాలో ధోనికి బాగా తెలుసు. ప్రపంచం ఏమనుకున్నా పర్వాలేదు. అతను మన దేశానికి సేవ చేస్తున్నాడు. ఆర్మీలోనూ సేవలందిస్తున్నాడు. ఇక రాజకీయాల్లోకి మాత్రం ప్రవేశించనని ముందే స్పష్టం చేశారు.

అతని రిటైర్ మెంట్ అతడినే నిర్ణయం తీసుకోనియండి అని పర్కొన్నారు. ఒక క్రికెట్ అభిమానిగా 2011 ప్రపంచకప్ ఫనల్లో శ్రీలంకపై గెలిచాక సచిన్ ను భులాపై ఎత్తుకొని తిరగడం తాను చూశానని, అలాగే ధోని కూడా టీ20 ప్రపంచకప్ లో ఆడి గెలిచాక స్టేడియంలో ఆటగాళ్ల భుజాలపై తీసుకె ళ్లడం తనకు చూడాలని ఉందన్నాడు.

మరోవైపు 2013లో ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఇరుకున్న శ్రీశాంత్ మళ్లీ టీమిండియా క్రికెటర్ గా రావాలని ఆశిస్తున్నాను. స్పాట్ ఫిక్సింగ్ కేసులో బీసీసీఐ అతడిపై జీవితకాలం నిషేధం విధించింది. ఈ కేసులో ఢిల్లీ ప్రత్యేక కోర్టు అతడిని గతంలోనే నిర్దోషిగా ప్రకటించినా బీసీసీఐ మాత్రం వెనక్కి తగ్గలేదు. గతేడాది సుప్రీంకోర్టు ఆ కేసును పరిశీలించి నిషేధ కాలాన్ని తగ్గించాలని ఆదేశించడంతో బీసీసీఐ ఏడేళ్లకు పరిమితం చేసింది. ఈ సెప్టెంబర్ తో ఆ గడువు పూర్తవుతుంది.

ఆ తర్వాత శ్రీశాంత్ ఫిట్ నెస్ ను నిరూపించుకుంటే కేరళ రంజీ జట్టులో చేర్చుకోవడానికి ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే శ్రీశాంత్ ఇప్పుడు తన ఫిట్ నెస్ కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యాడు. మళ్లీ  టీమిండియాకు ఆడాలని కోరుకుంటున్నాడు.

Read: టీ20 ప్రపంచకప్‌పై నిర్ణయించేది అప్పుడే.. ఐపీఎల్ కోసం ఎదురుచూపులు!