ధౌలిగంగ నది విలయం, చేపలు ముందుగానే గుర్తించాయా ? అలకనందలో వింత

ధౌలిగంగ నది విలయం, చేపలు ముందుగానే గుర్తించాయా ? అలకనందలో వింత

Did fish sense the oncoming deluge : ఉత్తరాఖండ్ లో నందాదేవి గ్లేసియర్ విరిగి పడి ధౌలిగంగ నది విలయం సృష్టించింది. హిమ‌నీన‌దాలు విరిగిప‌డి ఆక‌స్మిక వ‌ర‌ద విరుచుకుపడింది. అయితే..ఈ ప్రమాదం జరగడానికి ఒక గంట ముందు…సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాసు గ్రామంలో ఓ వింత చోటు చేసుకుంది. దీనిని ప్రజలు భారీగా తరలివచ్చారు.

అలకనంద నది. ఉదయం 9 గంటల సమయంలో వేల కొద్ది చేపలు..నది ఒడ్డుకు దగ్గరగా వచ్చేశాయి. ఇది చూసిన గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు చేపలు ఒడ్డుకు వస్తున్నాయి ? అని చర్చించుకున్నారు. వలలు లేకుండానే..చేతికి అందివచ్చే విధంగా ఉన్న చేపలను కొంతమంది పట్టుకుని ఇళ్లకు తీసుకెళ్లారు. కానీ..కాసేపట్లో ఓ విలయం రాబోతోందన్న విషయం వారికి తెలియదు. అలకనందకు ఉపనది ధౌలిగంగ. హిమనీనదాలు విరిగి పడి అకస్మిక వరద విరుచుకపడింది.

విపత్తును ముందే చేపలు గుర్తించాయా అనే ప్రశ్నలు ఉదయించాయి. అవునని అంటున్నారు వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలోని సీనియర్ సైంటిస్టు శివకుమార్. నీటి ప్రవాహంలోని ప్రకంపనల చేపల సెన్సర్ వ్యవస్థకు ముందే తెలిసి ఉంటుందని అంచనా వేశారు. చేపలకు ఉండే పార్శ్య రేఖా అవయావాలు..ద్వారా నీళ్లలో కదలికలు, ఒత్తిడిలో మార్పును గుర్తిస్తాయని వెల్లడించారు. ఇవి చాలా సున్నితమైనవని, చిన్నమార్పు కూడా వీటిని క్రియాశీలం చేసి చేపలను షాక్ కు గురి చేస్తాయన్నారు. ముందుగానే చేపలు గ్రహించి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన.