Online Classes: ఆన్‌లైన్ క్లాస్ జరుగుతుండగా మహిళా టీచర్లకు అలా కనిపించిన స్టూడెంట్

ఆన్‌లైన్ కోడింగ్ క్లాసులు జరుగుతుండగా మహిళా టీచర్లకు తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడ్ని రాజస్థాన్‌కు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న వ్యక్తిగా గుర్తించిన ముంబై పోలీసులు...

Online Classes: ఆన్‌లైన్ క్లాస్ జరుగుతుండగా మహిళా టీచర్లకు అలా కనిపించిన స్టూడెంట్

cyber-criminals

Online Classes: ఆన్‌లైన్ కోడింగ్ క్లాసులు జరుగుతుండగా మహిళా టీచర్లకు తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడ్ని రాజస్థాన్‌కు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న వ్యక్తిగా గుర్తించిన ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిఫెన్స్ లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కొడుకైన నిందితుడికి కంప్యూటర్స్ మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 మధ్యలో ఈ కోడింగ్ లెక్చరర్లు జరిగాయి. దీనికి సంబంధించి పార్టిసిపెంట్స్ వారి మొబైల్ నెంబర్లతో పాటు ఈమెయిల్ ఐడీలు కూడా ఇచ్చారు. ఇటువంటి ఘటనలు పలుమార్లు జరగడంతో ఒకానొక సందర్భంలో ఆన్‌లైన్ లెక్చర్లు క్లోజ్ చేయాలనే ఆలోచనకు వచ్చారు టీచర్లు.

ముంబైలోని శకినాక పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ మేరకు.. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. టెక్నికల్ సర్వేలెన్స్ వాడిన అధికారులు నిందితుడి లొకేషన్ తెలుసుకోగలిగారు. అతణ్ని పట్టుకునేందుకు గత నెలలో పోలీస్ టీంను కూడా పంపించారు. పలుమార్లు నిందితుడ్ని పట్టుకోవడంలో ఫెయిల్ అయిన పోలీసులు.. ఎట్టకేలకు ఆ వ్యక్తి అడ్రస్ మార్చినట్లుగా గుర్తించారు.

ఇన్వెస్టిగేషన్ టీం రాజస్థాన్ లో ఉన్నప్పుడే మరోసారి అలాంటి ఘటనే జరిగింది. ఆ వ్యక్తి జైసల్మేర్ లో ఉన్నట్లు తెలిసింది.

అతని ల్యాప్ టాప్ ను పరిశీలించిన తర్వాత ఐపీ అడ్రస్ ట్రాక్ చేయడానికి వీల్లేకుండా సెట్టింగ్స్ ఛేంజ్ చేసినట్లుగా తెలిసింది. పైగా అతనెప్పుడూ ముఖం చూపించకుండానే జాగ్రత్త పడి.. ఒకే ఒక్క సారి మాత్రం స్క్రీన్ షాట్ లో దొరికిపోయాడు. ఆ ఇమేజ్ సాయంతో వెనుక ఉన్న బ్యాక్ గ్రౌండ్ ఆధారంగా అతణ్ని పట్టుకోగలిగినట్లు అధికారులు చెబుతున్నారు.

క్లాస్ జరుగుతుండగా అసభ్యంగా ప్రవర్తించడానికి కారణమేంటని ప్రశ్నించిన టీచర్లకు.. సరదా కోసం చేసినట్లు చెప్పాడు.