PM Kisan Samman Nidhi: 11వ విడత పీఎం కిసాన్ నిధులు మీకు అందలేదా? అయితే ఇలా చెక్ చేసుకోండి..

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంకు సంబంధించి 11వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోదీ మే31న విడుదల చేశారు. 10కోట్ల మంది రైతులకు రూ. 20వేల కోట్లు విడుదల చేశారు. అర్హులైన ప్రతీ రైతుకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలు సహాయంగా అందిస్తుంది.

PM Kisan Samman Nidhi: 11వ విడత పీఎం కిసాన్ నిధులు మీకు అందలేదా? అయితే ఇలా చెక్ చేసుకోండి..

Pm Kishan (1)

PM Kisan Samman Nidhi: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంకు సంబంధించి 11వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోదీ మే31న విడుదల చేశారు. 10కోట్ల మంది రైతులకు రూ. 20వేల కోట్లు విడుదల చేశారు. అర్హులైన ప్రతీ రైతుకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలు సహాయంగా అందిస్తుంది. వీటిని మూడు విడతల్లో రూ.2వేల చొప్పున అందిస్తుంది. ఇప్పటి వరకు 11 విడతల్లో నగదును రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేసింది. 11వ విడత నిధులను ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. అయితే కొంత మంది రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు జమకాగా, మరికొందరు రైతుల్లో జమ కాలేదు. దీంతో పీఎం కిసాన్ నిధులు అందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ ఖాతాల్లో ఎందుకు నిధులు జమ కాలేదని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆరాతీసే ప్రయత్నం చేస్తున్నారు.

 

Pm Kishan (2)

11వ విడత పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లో జమ కావాలంటే తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో లేదా మే31 వరకు ఈ- కేవైసీ చేయించుకొనేందుకు గడువు విధించింది. గడువులోపు చాలా మంది రైతులు ఈ-కేవైసీ చేయించుకోలేదు. దీంతో వారికి డబ్బులు జమ కాలేదు. అయితే గడువులోగా ఈ- కేవైసీ చేయించుకున్న రైతులకు కూడా పీఎం కిసాన్ నిధులు ఖాతాల్లోకి జమ కాలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు ఈనెల 31 తరువాత ఈ కేవైసీ పూర్తిచేసుకున్న వారికి నగదు ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి. అయితే మే 29వ తేదీ వరకు ఈ- కేవైసీ చేయించుకున్న వారి ఖాతాల్లో నగదు జమ అయినట్లు తెలుస్తోంది. ఈ- కేవైసీ చేయించుకున్న మిగిలిన రైతుల ఖాతాల్లో మరికొద్ది రోజుల్లో నిధులు జమ చేస్తారని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.

Pm Kishan (3)

అయితే.. పీఎం కిసాన్ 11వ విడత నిధులు అందుకోలేకపోయిన రైతులు, మీరు నమోదు చేసుకున్న ఫోన్ నెంబర్ నుంచి మెస్సేజ్ లేదా ఫోన్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకుగాను Email ID: pmkisan-ict@gov.in. and pmkisan-funds@gov.in లేదా PM Kisan Helpline No.: 011-24300606, 155261, PM Kisan Toll Free Number: 1800-115-526 నెంబర్లకు పోన్ చేసి మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పొందేందుకు అర్హులుగా ఉన్నారా? ఉంటే ఎప్పటి వరకు నగదు ఖాతాల్లో జమ అవుతుందనే విషయాలు తెలుసుకోవచ్చు.

Pm Kishan

ఆన్ లైన్ ద్వారా తెలుసుకోవాలంటే..
– pmkisan.gov.in కి వెళ్లాలి.
– Farmers Corner విభాగం కింద.. Beneficiary Status పై క్లిక్ చేయండి.
– ఆధార్ వివరాలు లేదా బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేయండి.
– ఇప్పుడు ‘గెట్ డేటా’పై క్లిక్ చేయండి. ఇన్‌స్టాల్‌మెంట్ స్థితి స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.