Covid Variants : వేరియంట్లు.. మ్యుటేషన్లు.. స్ట్రెయిన్లు ప్రాణాంతకమా?

కరోనా వైరస్‌ ఎప్పటికప్పుడూ రూపాంతరం చెందుతోంది. మొదటి వేవ్‌తో మొదలై రెండో వేవ్‌తో వణికిస్తోంది. ఇక మూడో వేవ్‌ వస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మొదట్లో వచ్చిందేమో కరోనా వైరస్‌ వేరియంట్‌ ఆల్ఫా అయితే.. సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియంట్..

Covid Variants : వేరియంట్లు.. మ్యుటేషన్లు.. స్ట్రెయిన్లు ప్రాణాంతకమా?

Covid Variants

Variant Mutant and Strains : కరోనా వైరస్‌ ఎప్పటికప్పుడూ రూపాంతరం చెందుతోంది. మొదటి వేవ్‌తో మొదలై రెండో వేవ్‌తో వణికిస్తోంది. ఇక మూడో వేవ్‌ వస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మొదట్లో వచ్చిందేమో కరోనా వైరస్‌ వేరియంట్‌ ఆల్ఫా అయితే.. సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియంట్.. ఆ తర్వాత వచ్చే మూడోవేవ్‌కు డెల్టా ప్లస్‌ కారణమయ్యే అవకాశం ఉంది. వైరస్‌ ఎందుకిలా మ్యూటేట్‌ అవుతుంది? వేరియంట్లు, స్ట్రెయిన్లుగా ఎలా మారుతుందో తెలుసా? సాధారణంగా జన్యు, ప్రొటీన్‌ పదార్థాలను మార్చుకుంటాయి. వీటినే మ్యుటేషన్లుగా పిలుస్తారు. జన్యు, ప్రొటీన్లలో జరిగిన మార్పులను వైరస్‌ లక్షణాలు తీవ్రంగా మార్చేస్తాయి.

మ్యుటేషన్లు జరిగిన వైరస్‌ రకాలను వేరియంట్లుగా పిలుస్తారు. మ్యుటేషన్లతోనే కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయి. కొన్ని వేరియంట్లను ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (VIO)గా చెబితే. ప్రాణాంతకంగా మారే వాటిని ‘వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌ (VoC)గా సూచిస్తారు. కోవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం వల్ల వ్యాప్తి చెందుతుంది. వ్యాపించిన కొద్దీ వైరస్‌ తన సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. ఈ క్రమంలో వైరస్ లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ప్లాస్మా థెరపీ, వ్యాక్సిన్లు, మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ వంటి చికిత్సలతో రోగనిరోధక శక్తిని కూడా ఎదుర్కొనేంతగా వైరస్ సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. మ్యుటేషన్లతో వైరస్‌ ఇన్ఫెక్షన్‌ తీవ్ర స్థాయిలోకి చేరుతుంది. వ్యాప్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థకు దొరకనతంగా వ్యాపిస్తుంది. లంగ్స్ లోని కణాలకు సులువుగా అతుక్కునే అవకాశం ఉంది.

మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌ నుంచి కూడా తప్పించుకోనే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 174 జిల్లాల్లో ప్రమాదకర కరోనా వేరియంట్లను గుర్తించారు. మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, గుజరాత్‌లలో ఎక్కువగా ఉన్నాయి. 40వేల శాంపిళ్లలో ప్రమాదకర వేరియంట్లపై ఆల్ఫా వేరియంట్‌ కేసులు 3,969గా ఉన్నాయి. ఇక గామా వేరియంట్ ఒకటి.. బీటా రకం 149.. డెల్టా కేసులు 16,238 నమోదయ్యాయి. కొత్త కేసుల్లో VoC శాతం మే రెండో వారానికి 10.31 శాతమే ఉంది. జూన్‌ 20 నాటికి ఏకంగా 51 శాతానికి పెరిగిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశంలో కరోనా రెండో వేవ్‌ వ్యాప్తికి కారణమైన డెల్టా (B.1.617) వేరియంట్‌ మార్పులతో మూడు సబ్‌ వేరియంట్లుగా మారింది. కప్పా (B.1.617.1), లంబ్డా (B.1.617.3)లను జాగ్రత్త పడాల్సిన ‘VOI’ రకాలుగా గుర్తించారు. డెల్టా ప్లస్‌ (B.1.617.2 లేదా AY.1) రకాన్ని ప్రమాదకరమైన ‘VOC’ రకంగా ప్రకటించారు. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందగలదు.. ఊపిరితిత్తుల్లోని కణాలకు అతుక్కుంటుంది. వ్యాక్సిన్‌తో రోగ నిరోధక శక్తి, మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ నుంచి తప్పించుకునే సామర్థ్యం కూడా డెల్టాకు పెరిగిందనే చెప్పాలి.