Ram Setu: రామసేతు ఉందని చెప్పడం కష్టమే.. ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం షాకింగ్ ఆన్సర్

కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఈ సమాధానంపై కాంగ్రెస్ పార్టీ చురకలు అంటించింది. కేంద్ర ప్రభుత్వం చెప్పే సంగతులు కళ్లు తెరిచి చూడాలంటూ, చెవులు రెక్కించి వినాలంటూ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘భక్తులందరూ చెవులు విప్పి వినండి, కళ్లు తెరిచి చూడండి.. రామసేతు ఉందనడానికి ఎలాంటి రుజువు లేదని పార్లమెంట్‌లో మోదీ ప్రభుత్వం చెబుతోంది’’ అని ట్వీట్ చేశారు

Ram Setu: రామసేతు ఉందని చెప్పడం కష్టమే.. ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం షాకింగ్ ఆన్సర్

Difficult to say real form of Ram Setu: Govt in Parliament

Ram Setu: ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలువబడే రామసేతుపై కేంద్ర ప్రభుత్వం సంచలన కామెంట్స్ చేసింది. వాస్తవానికి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పార్టీ నేతల అభిప్రాయం మేరకు కానీ, ఆ పార్టీ భావజాలం మేరకు కానీ అది స్వయంగా శ్రీరాముడు నిర్మించిన రామసేతు. దీనిపై శాస్త్రీయ అధ్యయనం జరగాలని అదే పార్టీకి చెందిన ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సహా అనేక మంది చట్ట సభల్లో సైతం గొంతెత్తుతున్నారు. తాజాగా ఇదే ప్రశ్న ఒక స్వతంత్ర ఎంపీ అడగ్గా.. ‘‘వాస్తవంగా మాట్లాడుకుంటే అలాంటిది ఒకటి ఉందని చెప్పడం చాలా కష్టం’’ అని కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. నిజానికి కేంద్రం నుంచి ఇలాంటి సమాధానం వస్తుందని దేశంలో ఎవరూ ఊహించరు.

#LetHerLearn: యూనివర్సిటీ చదువులకు నో ఎంట్రీ.. తాలిబన్ ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగరేసిన అఫ్గాన్ మహిళలు

హర్యానాకు చెందిన స్వతంత్ర ఎంపీ కార్తికేయ శర్మ రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. నిర్మాణంపై శాస్త్రీయ పరిశోధన కోసం ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ.. “రామసేతు అక్కడ ఉందని చెప్పడం కష్టం. అయితే, అక్కడ నిర్మాణం ఉండవచ్చని కొన్ని సూచనలు చెప్తున్నాయి” అని ప్రభుత్వం సమాధానం చెప్పింది’’ అని పేర్కొంది. “గత ప్రభుత్వాలు నిరంతరంగా ఈ సమస్యపై శ్రద్ధ చూపకపోవడంతో భారతదేశానికి చెందిన అద్భుతమైన చరిత్ర మరుగున పడిపోతోంది. దీనిపై ప్రభుత్వం ఏదైనా శాస్త్రీయ పరిశోధన చేస్తుందా?” అని కార్తికేయ శర్మ ప్రశ్నించారు.

Abdul Bari Siddiqui: ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, విదేశాల్లోనే సెటిలవ్వమని నా పిల్లలకు చెప్పాను.. ఆర్జేడీ నేత సిద్ధిఖీ

‘‘స్పేస్ టెక్నాలజీ ద్వారా సముద్రంలో కొన్ని రాళ్ల ముక్కలు కనుగొనబడినట్లు మేము కనుగొన్నాము. రామసేతు ఉన్నట్లు చూపించే కొన్ని ఆకారాలు ఉన్నాయి. సముద్రంలో కొన్ని ద్వీపాలు, సున్నపురాయి వంటివి కనిపించాయి. అలా అని వీటిని ఆధారంగా చేసుకుని రామసేతు అనేది అక్కడ ఉందని చెప్పడం కష్టం. అయితే, అక్కడ నిర్మాణం ఉండవచ్చని సూచించే కొన్ని సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి” కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఇక ఇలాంటి పరిశోధన గురించి ఆయన మాట్లాడుతూ.. పురాతన నగరం ద్వారక వంటి వాటిని పరిశోధించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.

Siddique Kappan: ఎట్టకేలకు సిద్ధిఖీ కప్పన్‭కు బెయిల్.. రెండేళ్లు జైలులోనే మగ్గిన కేరళ జర్నలిస్ట్

కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఈ సమాధానంపై కాంగ్రెస్ పార్టీ చురకలు అంటించింది. కేంద్ర ప్రభుత్వం చెప్పే సంగతులు కళ్లు తెరిచి చూడాలంటూ, చెవులు రెక్కించి వినాలంటూ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘భక్తులందరూ చెవులు విప్పి వినండి, కళ్లు తెరిచి చూడండి.. రామసేతు ఉందనడానికి ఎలాంటి రుజువు లేదని పార్లమెంట్‌లో మోదీ ప్రభుత్వం చెబుతోంది’’ అని ట్వీట్ చేశారు. ప్రాచీన భారతీయ సంస్కృత ఇతిహాసం రామాయణంలో, రామసేతును రాముడు, అతని సైన్యం నిర్మించినట్లు ప్రస్తావించారు.