RBI : ఇంటర్నెట్ లేకుండా…డిజిటల్ చెల్లింపులు!

ఆఫ్ లైన్ (ఇంటర్నెట్ లేకుండా) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) వేగంగా అడుగులు వేస్తోంది.

RBI : ఇంటర్నెట్ లేకుండా…డిజిటల్ చెల్లింపులు!

Digital Payment

Digital Payments : డిజిటల్ చెల్లింపులు ఎక్కువవుతున్నాయి. చాలా మంది వీటి ద్వారానే డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే..ఈ డబ్బులు పంపాలంటే..ఇంటర్నెట్ కంపల్సరీ. చాలా మందికి ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం..తరచూ సమస్యలు వస్తుండడంతో ఆన్ లైన్ చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

Read More : Indian Richest women: భారతీయ మహిళల్లో.. ధనవంతులు వీరే..!

ఈ క్రమంలో…ఆఫ్ లైన్ (ఇంటర్నెట్ లేకుండా) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) వేగంగా అడుగులు వేస్తోంది. త్వరలోనే ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాల్లోనూ డబ్బులను పంపించే వీలు కలిగే అవకాశం ఏర్పడనుంది. త్వరలోనే ఓ కార్యాచరణను ప్రకటిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.

Read More : IMPS : పండుగ వేళ, ఆర్బీఐ శుభవార్త..రూ. 5లక్షల వరకు ట్రాన్స్ ఫర్

ఇంటర్నెట్ సదుపాయం, నెట్ వర్క్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో డిజిటిల్ చెల్లింపులను ప్రోత్సాహించేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. గత సంవత్సరం ఆగస్టులో ఆర్బీఐ ఓ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించింది. గరిష్టంగా రూ. 200 వరకు రిటైల్ లావాదేవీలను కార్డులు, మొబైల్ సాధానాల ద్వారా పూర్తి చేసేందుకు అనుమతించింది. ఈ పైలెట్ ప్రాజెక్టు 2021, మార్చి 31 వరకు కొనసాగింది. ఎలాంటి అదనపు ధృవీకరణలు అవసరం లేకుండా…చెల్లింపులకు ఓకే చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మంచి ఫలితాలు ఇవ్వడంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ విధానం తీసుకరావాలని ఆర్బీఐ యోచిస్తోంది.