Digvijay Singh : RSSని తాలిబన్ తో పోల్చిన దిగ్విజయ్ సింగ్

మహిళలను గౌరవించే విషయంలో తాలిబన్లకు, ఆర్‌ఎస్‌ఎస్​కు పెద్ద తేడా లేదని మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.

Digvijay Singh : RSSని తాలిబన్ తో పోల్చిన దిగ్విజయ్ సింగ్

Diggi

Digvijay Singh మహిళలను గౌరవించే విషయంలో తాలిబన్లకు, ఆర్‌ఎస్‌ఎస్​కు పెద్ద తేడా లేదని మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. మహిళలు మంత్రులుగా ఉండటానికి సరిపోరని తాలిబన్లు అంటున్నారు. మహిళలు ఇంట్లో ఉంటూ.. ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలని మోహన్ భగవత్(ఆర్ఎస్ఎస్ చీఫ్)చెప్పారు. ఈ రెండూ ఒకే విధమైన సిద్ధాంతాలు కావా అని తాజాగా ఓ ట్వీట్ లో దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు.

అఫ్ఘానిస్తాన్ లో ఏర్పాటైన తాలిబన్ ప్రభుత్వంపై కేంద్రం వైఖరిని స్పష్టం చేయాలని దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. పలు ఉగ్రవాద సంస్థల్లో సభ్యులైన వారు మంత్రులుగా ఉన్న తాలిబన్ ప్రభుత్వాన్ని భారత్ గుర్తిస్తుందా.. లేదా అనే విషయాన్ని మోదీ-షా ప్రభుత్వం స్పష్టం చేయాలని దిగ్విజయ్ ట్వీట్‌ చేశారు

అంతకుముందు ఇండోర్‌లో నిర్వహించిన ‘సంప్రదాయక్ సద్భావన సమ్మేళనం’లో ఆర్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్‌ లక్ష్యంగా దిగ్విజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు. హిందూ-ముస్లింల డీఎన్​ఏ ఒకటేనన్న భగవత్ వ్యాఖ్యలపై స్పందించిన దిగ్విజయ్.. అలా అయితే లవ్ జిహాద్ లాంటి సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ ఏళ్లుగా విభజించు-పాలించు రాజకీయాలనే అవలంబిస్తోందని.. . అబద్ధాలు, అపోహలను వ్యాప్తి చేయడం ద్వారా హిందూ-ముస్లింలను రెండు వర్గాలుగా విభజిస్తోందని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు.