రైతు ఆందోళనలకు మద్దతుగా ఆర్మీ వెటరన్ సైనికులు.. మెడల్స్ వెనక్కి ఇచ్చేస్తామంటూ నిరసనలు

రైతు ఆందోళనలకు మద్దతుగా ఆర్మీ వెటరన్ సైనికులు.. మెడల్స్ వెనక్కి ఇచ్చేస్తామంటూ నిరసనలు

రైతు ఆందోళనలకు సింఘూ బోర్డర్ వద్ద ఇండియన్ ఆర్మీ వెటరన్ సైనికులు తమ మద్దతు కొనసాగిస్తున్నారు. ఆందోళనలో పాల్గొని నవంబర్ 26నుంచి కలెక్ట్ చేసిన 5వేల గ్యాలెంటరీ మెడల్స్ కూడా వెనక్కు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలకు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

పంజాబ్, హర్యానాలతో పాటు మరికొన్ని రైతుల కీలక ప్రాంతాల నుంచి మరో రెండు రోజుల్లో దాదాపు 25వేల మెడల్స్ వరకూ కలెక్ట్ చేసి త్యాగం చేయాలనుకుంటున్నారట.

‘నేను రైతులు, సైనికుల కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తిని. మా కుటుంబాల నుంచి ఎనిమిది మంది సరిహద్దు యుద్ధాల్లో అమరులయ్యారు. ఈ విషయం చెప్పడానికి నేను గర్విస్తున్నారు. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న పని వల్ల దేశం విలువ కోల్పోతుంది. ఒంటరిగా ఉండిపోవాల్సిన పరిస్థితి రాకమానదు’ అని 80ఏళ్ల రిటైర్డ్ మాజీ హవాల్దార్ బల్వంత్ సింగ్ హర్యానాలోని ఝాజ్జర్ నుంచి అంటున్నారు.

‘నవంబర్ 26నుంచి ఇక్కడే ఉన్నాం. మా ఏడుపుని వినకుండా.. ఈ చట్టాలు అమలు చేసేందుకు ఏసీ రూంలలో ఉండి చర్చలు జరుపుతుంది’ అని అన్నారు. ఓ అరడజను రైతులు గుర్‌దాస్‌పూర్ నుంచి రిటైర్డ్ సుబేదార్ ఎస్పీ సింగ్ ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ను కలిసి మెడల్స్  రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నారు. అది అన్‍‌సక్సెస్‌ఫుల్‌గా ముగియడమే కాక డిటెన్షన్ లో ఉండాల్సి వచ్చింది.

ఓ వైపు కొడుకులు దశాబ్దాల పాటు సేవలు అందించినందుకు పొందిన మెడల్స్ తిరిగి ఇచ్చేందుకు రెడీ అయపోగా తండ్రులేమో ఆందోళనలో పాల్గొంటున్నారు. ‘ఈ మెడల్స్ ఇచ్చింది ఎంటర్‌టైన్మెంట్ కోసం కాదు. చావును ఎదురించి చెమట చిందించి రక్తం, కన్నీళ్లు ధారపోసి కష్టపడిన జవాన్.. రైతు భవిష్యత్ కోసం నిలబడ్డాడని హర్యానాకు చెందిన కపిల్ దేవ్ అనే రైతు చెప్తున్నాడు.

ఝాజ్జర్ నుంచి రిటైర్డ్ హవాల్దార్ సురేశ్ కుమార్ దహియా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. రైతులు, సైనికులు చేస్తున్న ఆందోళనలు ఎప్పటికి ముగుస్తాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘దేశాన్ని ముందుకు తీసుకెళ్లేవి రెండే విషయాలు. ఒకటి రైతు రెండోది సైనికుడు. నా లాంటి చాలా మందిని ప్రభుత్వం కుంగిపోయేలా చేస్తుంది.

రైతులు బలవంతంగా చట్టాల్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితి. మరో వైపు ఆందోళనలు ప్యాకేజీలు తీసుకుని రాజకీయాల కోసం జరుగుతుందంటూ దుష్ప్రచారం జరుగుతుందని ఆయన ఆరోపించారు.