Sp dinner treat : నేను చెప్పినట్లు పెళ్లి చేసుకుంటే ‘మా ఇంట్లో డిన్నర్ ఇచ్చి మీ ఇంట్లో డ్రాప్ చేస్తా’

Sp dinner treat : నేను చెప్పినట్లు పెళ్లి చేసుకుంటే ‘మా ఇంట్లో డిన్నర్ ఇచ్చి మీ ఇంట్లో డ్రాప్ చేస్తా’

Bindh District Sp Dinner Treat

Bindh district sp dinner treat : పెళ్లి చేసుకునే జంటలకు మధ్య ప్రదేశ్‌లోని బింధ్ జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ ఓ వినూత్న ఆఫర్ ఇచ్చారు. నేను చెప్పినట్లుగా పెళ్లి చేసుకుంటే మా ఇంట్లో కొత్త జంటకు డిన్నర్ ఇస్తానని..ఆ తరువాత ప్రభుత్వం వాహనంలో వాళ్ల ఇంట్లో డ్రాప్ చేస్తానని ఆఫర్ ప్రకటించారు. అదేంటీ ఎస్పీకి అంత తీరిక ఎక్కడుంటుంది? కొత్త జంటలకు డిన్నర్ ఇవ్వటానికి..వాళ్ల ఇంట్లో డ్రాప్ చేయటానికి అనుకుంటున్నారా? నిజమే మరి ఎస్పీకి అంత తీరిక ఎక్కడుంటుంది? కానీ ఇది కరోనా కాలమాయో..ఎస్పీగారు ప్రకటించింది ఈ కరోనా నిబందనల గురించే మరి..పెళ్లి చేసుకోవాలంటే కరోనా నిబంధనలు తప్పనిసరి కదా? అందుకే బింధ్ జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ ఈ వింత ఆఫర్ ఇచ్చారు కొత్త జంటలకు. ఇంతకూ ఆయనగారు పెట్టే నిబంధలు ఏమిటీ అంటే..

కేవలం 10 మంది అంతకంటే తక్కువ మంది అతిథులతో వివాహం చేసుకునే వధూ వరులకు తన ఇంట్లో పసందైన డిన్నర్ ఇస్తానని మధ్య ప్రదేశ్‌లోని బింధ్ జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ ఆఫర్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం వివాహ వేడుకల్లో కేవలం 50 మంది మాత్రమే పాల్గొనాలి. జిల్లాలోని కుర్తారా గ్రామంలో జరిగిన ఓ పెండ్లి విందులో పెద్ద సంఖ్యలో అతిథులు మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా మ్యూజిక్‌కు డాన్స్‌లు చేస్తున్న ఓ వీడియో వైరల్ అయిన క్రమంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఎస్సీ ఇలా ప్రకటించారు. ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడటం తన బాధ్యతగా భావించిన ఎస్పీ ఈ ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించానని ఎస్పీ మనోజ్ కుమార్ ఆయన తెలిపారు.

ఈ వినూత్న ఆఫర్ గురించి ఎస్పీ మనోజ్ మాట్లాడుతూ..10 లేదా అంతకంటే తక్కువ మంది అతిథుల సమక్షంలో వివాహం చేసుకునే వధూవరులకు నా ఇంట్లో పసందైన డిన్నర్ ఇస్తాను. కొవిడ్-19 మార్గదర్శకాలను పాటించినందుకు కొత్త జంటకు మెమెంటోలు కూడా ఇస్తాం. కొత్త జంటలను ఇంటి నుంచి తీసుకొచ్చేందుకు, విందు తర్వాత ఇంటికి పంపేందకు ప్రభుత్వ వాహనం ఏర్పాటు చేస్తాం..’’ అని ఎస్పీ తెలిపారు.

కాగా.. ఈ ప్రకటన చేసి రెండు రోజులు అయినా..ఇప్పటి వరకూ ఒక్క జంట కూడా ఈ ఆఫర్‌ను వినియోగించుకోలేదని..కానీ మా యత్నం వథా పోలేదు..ఏప్రిల్ 30న వివాహం చేసుకోబోయే రెండు జంటలను తనను సంప్రదించాయని తెలిపారు.పది మంది సమక్షంలోనే తాము వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని సదరు జంటలు తెలిపాయని తెలిపారు. అలా వారు వివాహం చేసుకుంటే నా కుటుంబ సభ్యులతో కలిసి వారి కోసం రెండు డిన్నర్‌లు ఏర్పాటు చేస్తానని స్పష్టం చేసారు జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్.