Opposition Parties : వ్యవసాయ చట్టాలు, పెగాసస్​ వివాదంపై రాష్ట్రపతికి విపక్షాల లేఖ

రైతుల సమస్యలు, పెగాసస్​ ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంపై పార్లమెంట్​లో చర్చ జరిగేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏడు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్​నాధ్​ కోవింద్ ​కి లేఖ రాశాయి.

Opposition Parties : వ్యవసాయ చట్టాలు, పెగాసస్​ వివాదంపై రాష్ట్రపతికి విపక్షాల లేఖ

President

Opposition Parties   రైతుల సమస్యలు, పెగాసస్​ ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంపై పార్లమెంట్​లో చర్చ జరిగేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏడు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్​నాధ్​ కోవింద్ ​కి లేఖ రాశాయి. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. బీఎస్​పీ, ఆర్​ఎల్​పీ, ఎస్​ఏడీ, నేషనల్​ కాన్ఫరెన్స్​, సీపీఐ, సీపీఎంతో పాటు ఎన్​సీపీకి సంబంధించిన నేతలు రాష్ట్రపతికి రాసిన లేఖపై సంతకాలు చేసినట్లు ఆమె తెలిపారు.

కాగా, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న క్రమంలో పలువురు రైతులు మరణించడం చాలా దురదృష్టకరమని శిరోమణి అకాలీ దళ్​ నాయకురాలు హర్​ సిమ్రత్ కౌర్ బాదల్ అన్నారు. అయితే కేంద్రం ఇంకా వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చించడానికి సిద్ధంగా లేకపోవడం దారుణమని ఆమె విమర్శించారు.