Delhi liquor scam : శరత్ చంద్రారెడ్డికి పూర్తి స్థాయి బెయిల్ మంజూరు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డికి ఊరట లభించింది. ఇటీవల మధ్యంత బెయిల్ పై ఉన్న ఆయనకు ఢిల్లీ హైకోర్టు ఆయనకు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది.

Delhi liquor scam
Delhi liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డికి ఊరట లభించింది. ఇటీవల మధ్యంత బెయిల్ పై ఉన్న ఆయనకు ఢిల్లీ హైకోర్టు ఆయనకు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది. ఈక్రమంలో ఢిల్లీ హైకోర్టు ఇప్పుడు పూర్తిస్థాయిలో బెయిల్ ను మంజూరు చేయటంతో శరత్ చంద్రారెడ్డికి ఊరట లభించినట్లైంది. తిహార్ జైలులో ఉన్న శరత్ చంద్రారెడ్డి తన భార్య అనారోగ్య కారణాల పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేయాలన్న శరత్ చంద్రారెడ్డి కోర్టుకు విన్నవించుకున్నారు. దీంతో కోర్టు సానుకూలంగా స్పందిస్తు పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసింది.
తన భార్య అనారోగ్యం దృష్ట్యా ఆమెను చూసుకోవాలని..దాని కోసం అందుకు 6 వారాలు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్ దీనిపై విచారణ చేపట్టారు. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.తాజాగా శరత్‌చంద్రారెడ్డికి పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది.
కాగా రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా ధర్మాసనం శరత్ చంద్రారెడ్డికి పలు షరతులు విధించింది. భార్య చికిత్స కోసం మినహా హైదరాబాద్ దాటి వెళ్లకూడదని..ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. మొబైల్ ఫోన్ ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలని..అందులో లొకేషన్ ఆన్‌లో పెట్టాలని సూచించింది. సాక్షులను బెదిరించకూడదని హెచ్చరించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఢిల్లీతో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన ఇద్దరు ప్రముఖులను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయినవారిలో అరబిందో కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. ఆయన అరబిందో గ్రూప్‌లోని 12 కంపెనీలతో పాటు ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థకూ డైరెక్టర్‌గా ఉన్నారు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన రెండు కంపెనీలు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేస్తున్నాయి. వీటికి అరబిందో గ్రూప్‌కు చెందిన శరత్ చంద్రారెడ్డి కంపెనీ నుంచే బ్యాంకు గ్యారెంటీలు ఉన్నట్టుగా ఈడీ, సీబీఐ గుర్తించాయి.కాగా ఈ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవు తీహార్ జైల్లోనే ఉన్నారు. ఆయన పలుమార్లు బెయిల్ కోసం అభ్యర్థించినా బెయిల్ లభించలేదు.