Licking Feet: దివ్యాంగుడిని కాళ్లు నాకేలా చేస్తూ అవమానం

ఇద్దరు వ్యక్తులు కలిసి దివ్యాంగుడైన ఓ వ్యక్తిని బలవంతంగా కాళ్లు నాకేలా చేశారు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో ఈ ఘటన జరిగింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి కర్ర తీసుకుని బెదిరిస్తుండగా మరో వ్యక్తి బూటును నాకుతున్నట్లుగా ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ వద్ద ఘటన జరగ్గా ఆ ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Licking Feet: దివ్యాంగుడిని కాళ్లు నాకేలా చేస్తూ అవమానం

Licking Feet: ఇద్దరు వ్యక్తులు కలిసి దివ్యాంగుడైన ఓ వ్యక్తిని బలవంతంగా కాళ్లు నాకేలా చేశారు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో ఈ ఘటన జరిగింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి కర్ర తీసుకుని బెదిరిస్తుండగా మరో వ్యక్తి బూటును నాకుతున్నట్లుగా ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ వద్ద ఘటన జరగ్గా ఆ ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

దివ్యాంగుడు నేలపై కూర్చొని ఉండగా మరో వ్యక్తి కాలిని నాకాలని చెప్పాడు. ఏడుస్తున్న వ్యక్తి మెడ చుట్టూ కర్రను తిప్పుతూ భయపెడుతున్నాడు. వదిలేయమని ప్రాధేయపడుతున్నా… ఆదేశాలు విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవంటూ బెదిరించాడు. మరో వ్యక్తి అతని కాలిని బాధితుడు మొహం వరకూ తీసుకొచ్చాడు.

నిస్సహాయుడైన బాధితుడు చివరికి పసుపు రంగు టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి కాలిని నాకాడు. ఈ అమానవీయ చర్య తర్వాత నాలుకను శుభ్రం చేసుకునేందుకు ప్రయత్నించగా.. అలా చేయొద్దంటూ కర్రతో బెదిరించాడు. జుట్టును బలవంతంగా పట్టుకుని రెండోసారి కూడా కాళ్లను నాకించాడు.

Read Also : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం..దివ్యాంగ బాలిక‌పై అత్యాచారం

ఈ ఘటన తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు వాదనకు దిగారు. డీ అడిక్షన్ సెంటర్ లో ఉన్నవారంతా భయంతో అలా ఉండిపోయారు. దివ్యాంగుడికి జరుగుతున్న అన్యాయానికి నోరు తెరవకుండా ఉండిపోయారు. విషయం పోలీసులకు తెలియడంతో పలు సెక్షన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.