RRB Exams : అభ్యర్థుల ఆందోళనతో ఆర్‌ఆర్‌బీ పరీక్షలు నిలిపివేత

వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు నిర్వహించిన పరీక్షల్లో పాసైన, ఫెయిలైన అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఇబ్బందులను పరిశీలించేందుకు ఒక కమిటీని కూడా రైల్వే ఏర్పాటు చేసింది.

RRB Exams : అభ్యర్థుల ఆందోళనతో ఆర్‌ఆర్‌బీ పరీక్షలు నిలిపివేత

Rrb

Discontinuation of RRB examinations : రైల్వేలో ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించిన పరీక్షలు, ఎంపిక క్రమం తీరు పట్ల అభ్యర్ధులు ఆందోళన చేయడంతో ఎన్టీపీసీతో పాటు, లెవల్‌ వన్‌ పరీక్షలను నిలిపివేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. రిక్రూట్‌మెంట్‌ పరీక్షల ఎంపిక క్రమం పట్ల అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రెండు రోజులుగా హింసాత్మక నిరసనలకు, ఆందోళనలకు దిగారు. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే ప్రతినిధి తెలిపారు.

వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు నిర్వహించిన పరీక్షల్లో పాసైన, ఫెయిలైన అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఇబ్బందులను పరిశీలించేందుకు ఒక కమిటీని కూడా రైల్వే ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 16వరకు అభ్యర్థులు తమ అభ్యంతరాలను కమిటీ వద్ద నమోదు చేసుకోవచ్చు. ఇరు పక్షాల వాదనలను విన్న తర్వాత కమిటీ తన నివేదికను రైల్వే మంత్రిత్వ శాఖకు అందచేస్తుందని ప్రతినిధి తెలిపారు.

India Corona Cases : భారత్ లో కరోనా ఉధృతి.. ఒక్కరోజే 2,86,384 పాజిటివ్ కేసులు

కాగా, రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు విధ్వంసానికి, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారని వెల్లడైనట్లైతే వారిని రైల్వేలో ఎన్నటికీ రిక్రూట్‌మెంట్‌ చేసుకోకుండా నిషేధం విధిస్తామని హెచ్చరిస్తూ రైల్వే ఒక నోటీసు జారీ చేసింది. అంతకుముందు బీహార్‌లో పలు చోట్ల రైల్వే ట్రాక్‌లపై ఆందోళనకారులు బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు.

రైల్వే పరీక్షకు సంబంధించి ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఆందోళన సమయంలో విద్యార్థులను కొట్టినందుకు ఆరుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. అయితే, ఈ ఘటనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో విద్యార్థులను ప్రేరేపించినందుకు ఖాన్ సర్‌తో సహా పాట్నాలోని చాలా కోచింగ్ సెంటర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Delhi CM Kejriwal : ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్‌, భగత్‌సింగ్‌ ఫోటోలు మాత్రమే ఉండాలని ఆదేశం

సస్పెన్షన్‌కు గురైన ఆరుగురు పోలీసు సిబ్బందిలో ఒక ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరంతా అనవసరంగా విద్యార్ధులను కొట్టారని ఆరోపిస్తున్నారు. జనవరి 24వ తేదీన, రైల్వేస్ ఎన్టీపీసీ పరీక్ష ఫలితాలపై జరిగిన నిరసన జరగ్గా.. పాట్నాలో విద్యార్థులపై లాఠీచార్జికి వ్యతిరేకంగా ప్రయాగ్‌రాజ్ విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు.