Supreme Court Disha Case : ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ కేసు..విచారణ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం కోర్టు

సుప్రీంకోర్టు ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. దీనికి సంబంధించి శుక్రవారం (మే 20,2022) ఈ విషయాన్ని వెల్లడించింది. నివేదిక కాపీని ప్రభుత్వానికి అలాగే పిటిషనర్లకు ఇవ్వాలని సిర్పుర్కర్ కమిషన్ న్యాయవాదికి ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన విచారణకు ఇక హైకోర్టు చేపడుతుంది అని వెల్లడించింది.

Supreme Court Disha Case : ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ కేసు..విచారణ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం కోర్టు

Supreme Court Disha Case

Supreme Court Disha Case : సుప్రీంకోర్టు ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. దీనికి సంబంధించి శుక్రవారం (మే 20,2022) ఈ విషయాన్ని వెల్లడించింది. నివేదిక కాపీని ప్రభుత్వానికి అలాగే పిటిషనర్లకు ఇవ్వాలని సిర్పుర్కర్ కమిషన్ న్యాయవాదికి ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన విచారణకు ఇక హైకోర్టు చేపడుతుంది అని వెల్లడించింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్టుగా ప్రకటించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది లేవనెత్తిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తమ అభ్యంతరాలను హైకోర్టు ముందుంచాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది. ఇరువురు తమ వాదనలు హైకోర్టు ముందే వినిపించాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.

ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నివేదిక సీల్డ్ కవర్ లోనే ఉంచాలని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనను తోసిపుచ్చింది.ఇది పబ్లిక్ ఎంక్వయిరీ అని అవసరమైతే..నివేదికలోని అంశాలను తామే చదివి వినిపిస్తామని సీజేఐ వ్యాఖ్యానించారు. సిర్పూర్కర్ కమిషన్ నివేదికను ఎందుకు బహిర్గతపర్చవద్దని కూడా ధర్మాసనంలో మరో జడ్జి హిమా కోహ్లి ప్రశ్నించారు.దేశంలో దారుణమైన పరిస్థితులున్నాయని కూడా సీజేఐ ఎన్వీ రమణ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Also read : Supreme Court : దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఈ నివేదికను మరోసారి పరిశీలించేది లేదని సీజేఐ స్పష్టంచేశారు. అంతకు ముందు ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. అయితే ఈ విషయమై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయాన్ని చెప్పాలని ప్రభుత్వ అడ్వకేట్ కు సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై 10 నిమిషాల సమయం ఇచ్చింది. 10 నిమిషాల తర్వాత న్యాయవాది ప్రభుత్వ నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం ముందుంచారు. దీంతో ఈ కేసును సుప్రీంకోర్టు నుండి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. కాగా సుప్రీంకోర్టులో శుక్రవారం (మే 29,2022) జరిగిన విచారణకు మాజీ సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హాజరయ్యారు.

కాగా..హైద్రాబాద్ కు సమీపంలోని షాద్ నగర్ చటాన్ పల్లి అండర్ పాస్ వద్ద దిశపై 2019 నవంబర్ 28న నలుగురు  అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం హత్య చేశారు.ఈ ఘటనకు పాల్పడిన నలుగురు వ్యక్తులను మహమ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ, జోల్లు నవీన్ లను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. నిందితులను తమకు అప్పగించాలని పోలీస్ స్టేషన్ ముందు అనేకమంది ఆందోళ చేశారు.  ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈక్రమంలో నిందితులను సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసేందుకు చటాన్ పల్లి అండర్ పాస్ వద్దకు తీసుకొచ్చిన సమయంలో పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు గాను ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులు మరణించారని అప్పటిసీ సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు.2019 డిసెంబర్ 6న ఈ ఎన్ కౌంటర్ జరిగింది.

ఈ ఎన్ కౌంటర్ పై హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున ఖండించాయి. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని అన్నారు. దీనిపై విచారణ జరగాల్సిందేనని అన్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో పిటిసన్ దాఖలు చేశాయి. ఈ ఎన్ కౌంటటర్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ విచారణకు డిమాండ్ చేశాయి. దీంతో సుప్రీంకోర్టు సిర్ప్కూర్కర్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. సిర్పూర్కర్ కమిషన్ హైద్రాబాద్ కేంద్రంగా విచారణ నిర్వహించింది. ఈ కమిషన్ నివేదికను 2022 జనవరిలో సుప్రీంకోర్టుకు అందించింది.దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఫోరెన్సిక్ నివేదికలు, డాక్యుమెంట్ రికార్డ్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, పోస్ట్ మార్టం రిపోర్ట్స్, సీన్ ఆఫ్ అఫెన్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కమిషన్ సభ్యులు సేకరించారు. అడ్వకేట్స్, ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు, మాజీ సైబరాబాద్ సీపీ సజ్జనార్, దిశ కుటుంబ సభ్యులు, ఎన్ కౌంటర్ లో చనిపోయిన కుటుంబ సభ్యులను కమిషన్ విచారించింది. వీటి ఆధారంగా తయారు చేసిన నివేదికను సిర్పూర్కర్ కమిషన్ ఉన్నత న్యాయస్థానానికి అందించింది.

ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీస్ అధికారులు సైబరాబాద్ సీపీగా అప్పట్లో పనిచేసిన వీసీ సజ్జనార్ సహా పోలీసు వ్యాన్ డ్రైవర్లను కూడా కమిషన్ విచారించి కీలకమైన రిపోర్టు తయారు చేసింది.ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని కూడా కమిషన్ సభ్యులు పరిశీలించారు. అంతేకాదు ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీసు అధికారిని కూడా కమిషన్ విచారించి రిపోర్టు సిద్దం చేసింది. కాగా దిశపై జరిగిన అత్యాచారం పెను సంచలనమైంది. కేసు కీలక మలుపులు తిరిగింది.