దీపావళి కానుక: ఉద్యోగుల జీతం పెంపు

దీపావళి కానుక: ఉద్యోగుల జీతం పెంపు

కేంద్ర ప్రభుత్వం బుధవారం దీపావళి కానుక ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే టీఏడీఏలో 5శాతం పెంచుతున్నట్లు శుభవార్తను వినిపించింది. పెన్షనర్లకు, ప్రస్తుత ఉద్యోగులకు ఇస్తున్న వేతనంలో డియర్‌నెస్ అలోవెన్స్‌ను పెంచనున్నారు. వినియోగదారుల డిమాండ్ పెరుగుతుండటం దానికి తగ్గట్లు ఆర్థిక మందగమనంతో ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారని ఈ నిర్ణయం తీసుకున్నారు. 

క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం ఈ విషయాన్ని ప్రకటించారు. 2019 జులై నెల నుంచి ఈ అల్లోవెన్సు అమలులోకి రానుంది. ఈ పెంపుతో ప్రభుత్వానికి 16వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చవుతాయి. దీని ద్వారా 50లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందడమే కాక, 62లక్షల మంది పెన్షనర్లకు కూడా ఇది వర్దిస్తుంది. 

ప్రధాని మోడీ నాయకత్వంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. అందులో ఒకటే ఉద్యోగులకు 5శాతం డీఏ పెంచడమని జవదేకర్ తెలిపారు. ప్రభుత్వం పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పలు సెక్టార్లలో వృద్ధి రేటు తగ్గడంతో డిమాండ్ పెరిగిపోయింది. ఈ నిర్ణయంతో సేవలు మరింత వేగమయ్యే సూచనలు ఉన్నాయి.