విజయ్ కాంత్‌తో కుదరలేదు.. కాంగ్రెస్‌కు 10, డీఎంకేకు 20

  • Published By: vamsi ,Published On : March 5, 2019 / 10:33 AM IST
విజయ్ కాంత్‌తో కుదరలేదు.. కాంగ్రెస్‌కు 10, డీఎంకేకు 20

సార్వత్రిక ఎన్నికలు ముందుకొస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు పోత్తులు, ఎత్తులు వేస్తూ రాజకీయాలను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణాదిలో బలమైన పార్టీగా ఉన్న డీఎంకే తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తమిళనాడులోని ప్రతిపక్ష డీఎంకే పార్టీ ఎన్నికలలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
Also Read : ఆప్ తో పొత్తు లేదు: ప్రకటించిన కాంగ్రెస్

తమిళనాట ఎప్పటిలాగే డీఎంకే పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళుతోంది. రాష్ట్రంలో 10 లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ కు కేటాయించగా మిగతా 20 చోట్ల డీఎంకే పోటీ చేస్తోంది. ఈ మేరకు మంగళవారం డీఎంకే చీఫ్ స్టాలన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఏ ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి పోటీ చేస్తారో ఈ నెల 7వ తేదీన ప్రకటిస్తామని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 39 లోక్ సభ స్థానాలు ఉండగా 30 సీట్లకు పోటీ చేస్తామని స్టాలిన్ ప్రకటించారు. మరో తొమ్మిది స్థానాలలో మిత్ర పక్షాలు పోటీ చేయనున్నారు. 
Also Read : అటో ఇటో ఎటో : పవన్ కల్యాణ్ తో మాగుంట భేటీ

వీసీకే, సీపీఐ, సీపీఐ(ఎమ్) పార్టీలకు తలా రెండు సీట్లు.. ఎమ్‌డీఎమ్‌కే, కేడీఎమ్‌కే, ఐజేకే మరియూ ఐయూఎమ్ ఎల్ పార్టీలకు తాలా ఒక్క సీటు కేటాయించారు. వైకో అధినేతగా ఉన్న ఎమ్‌డీఎమ్ కేకు కూడా ఒక రాజ్యసభ సీటు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. అయితే చిన్న పార్టీలు అయిన కేడీఎమ్‌కే, ఐజేకే పార్టీలు డీఎమ్ కే సింబల్ మీద పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక కెప్టెన్ విజయ్ కాంత్ నేతృత్వంలోని డీఎండీకే పార్టీతో చర్చలు జరిపిన డీఎంకే సానుకూలత లేకపోవడంతో పొత్తు కుదరలేదు.
Also Read : అర్హులకు మాత్రమే :రేషన్ కార్డుల జారీలో కీలక నిర్ణయం