DMK Brick : డీఎంకే సక్సెస్ సీక్రెట్ ఈ ఇటుకే.. కుర్రాడి అస్త్రం అద్భుతం చేసింది

DMK Brick : డీఎంకే సక్సెస్ సీక్రెట్ ఈ ఇటుకే.. కుర్రాడి అస్త్రం అద్భుతం చేసింది

Brick

DMK Sucess Secret Brick : అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. తమిళనాడులో డీఎంకే జెండా ఎగిరింది. మళ్లీ అధికారం దక్కింది. డీఎంకే చీఫ్ స్టాలిన్ సీఎం కాబోతున్నారు. దీంతో డీఎంకే శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. మరి.. డీఎంకే గెలుపులో కీలక పాత్ర పోషించింది ఏంటో తెలుసా.. ‘ఇటుక’. ఏంటి.. నమ్మబుద్ధి కావడం లేదు కదూ. కానీ అది నిజం. ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ వాడిన ఇటుక బాగానే వర్కవుట్ అయ్యింది. ఆ పార్టీ విజయంలో ఇటుక పాత్ర ఎంతో ఉంది.

Udhayanidhi Stalin with his father

తాత మాజీ ముఖ్యమంత్రి.. తండ్రి పార్టీ అధినేత.. కుమారుడు సినీ రంగంలో ప్రవేశించి ఇప్పుడు రాజకీయాల్లో ఎంటరయ్యాడు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి తాతకు తగ్గ మనుమడు అని ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ నిరూపించుకున్నాడు. ఉదయనిధి చేసిన ప్రచారం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మధురై ప్రచారంలో ఉదయనిధి వ్యంగ్యంగా చేసిన విమర్శలు.. చర్యలను ఓటర్లను అమితంగా ఆకట్టుకున్నాయి.

కేంద్ర ప్రభుత్వం మధురైకు ఎయిమ్స్‌ (ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)ను మంజూరు చేసింది. మంజూరు చేసి మూడేళ్లు దాటినా ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. శంకుస్థాపనకే పరిమితమైంది. దీన్ని అస్త్రంగా చేసుకుని ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్‌ దూసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీరును ‘ఇటుక’ చూయిస్తూ ఇదిగోండి ఎయిమ్స్‌ అంటూ ఎద్దేవా చేశారు.

Udhayanidhi Stalin

ఈ ప్రచారం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఎయిమ్స్‌ అని రాసి ఉన్న ఇటుకను పార్టీ అధినేత, తన తండ్రి ఎంకే స్టాలిన్‌కు ఉదయనిధి ఆదివారం అప్పగించాడు. దానర్థం నాన్న మీరైనా ఎయిమ్స్‌ను పూర్తి చేయండి అని పరోక్షంగా చెప్పాడు. ఈ విధంగా తమిళనాడు ఎన్నికల్లో ఇటుక కీలక పాత్ర పోషించింది. ఉదయనిధి స్టాలిన్‌ తొలిసారి చెపాక్కం- ట్రిప్లికేన్‌ నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏకంగా 68వేల 880 ఓట్ల మెజార్టీ సాధించి తాత, తండ్రికి వారసుడు అనిపించుకున్నాడు.