War Of Words: జాగ్రత్త.. ఆ పని చేయకపోతే కేజ్రీవాల్ వస్తాడు: అస్సాం ముఖ్యమంత్రికి ఆప్ హెచ్చరిక

అస్సాంలోని ఉన్నత విద్యా పాఠశాలల అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయల్ని కేటాయిస్తున్నట్లు మంగళవారం హిమంత బిశ్వా శర్మ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనను గుర్తు చేస్తూ సీఎం హిమంతకు ఆప్ హెచ్చరిక చేసింది. ‘‘ప్రభుత్వ పాఠశాలలను గాడిలో పెట్టండి. వాటిని ఉన్నతంగా తీర్చిదిద్దండి. లేదంటే కేజ్రీవాల్ వస్తారు’’ అంటూ ఆప్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చివర్లో అగ్నికి సంబంధించిన ఎమోజీని షేర్ చేసింది.

War Of Words: జాగ్రత్త.. ఆ పని చేయకపోతే కేజ్రీవాల్ వస్తాడు: అస్సాం ముఖ్యమంత్రికి ఆప్ హెచ్చరిక

Do better the government schools Otherwise Kejriwal will come

War Of Words: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. లిక్కర్ పాలసీని ప్రస్తావిస్తూ ఢిల్లీ స్కూల్ మోడల్ అనేది వట్టి అభూత కల్పనని ఆమ్ ఆద్మీ పార్టీపై హిమంత బిశ్వా శర్మ విమర్శలు గుప్పిస్తుండగా.. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ రుణాల మాఫీ చేసిందని ఎత్తిచూపుతూ హిమంత బిశ్వా శర్మపై ఆప్ మండిపడుతోంది.

కాగా, అస్సాంలోని ఉన్నత విద్యా పాఠశాలల అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయల్ని కేటాయిస్తున్నట్లు మంగళవారం హిమంత బిశ్వా శర్మ ప్రకటించారు. విద్యావిధానంపై కేజ్రీవాల్‭ను విమర్శిస్తున్న శర్వ.. ఉన్నపళంగా విద్యకు ఇంత పెద్దమొత్తంలో ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే శర్మ చేసిన ఈ ప్రకటనను ప్రస్తావిస్తూ ఆప్ హెచ్చరిక చేసింది. ‘‘ప్రభుత్వ పాఠశాలలను గాడిలో పెట్టండి. వాటిని ఉన్నతంగా తీర్చిదిద్దండి. లేదంటే కేజ్రీవాల్ వస్తారు’’ అంటూ ఆప్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చివర్లో అగ్నికి సంబంధించిన ఎమోజీని షేర్ చేసింది.

ఇదిలా ఉంటే.. అరవింద్ కేజ్రీవాల్‭పై సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీపై స్పందించిన ఆయన.. అధికారం మత్తులో కేజ్రీవాల్‭ కూరుకుపోయాడని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ పాలసీపై బీజేపీ నానా హంగామా చేస్తుండగా.. లోక్‭పాల్ ఉద్యమాన్ని ముందుడి నడిపి.. కేజ్రీకి గురువుగా ఉన్న హజారే ఈ స్థాయిలో విమర్శలు చేయడంతో కేజ్రీవాల్ ఇరకాటంలో పడ్డట్టే తెలుస్తోంది.

Idgah Maidan: ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలు వద్దు.. సుప్రీంకోర్టు తీర్పు