Delhi : సార్..లాక్ డౌన్ ఎత్తేయండి…వ్యాపారుల వేడుకోలు

Delhi : సార్..లాక్ డౌన్ ఎత్తేయండి…వ్యాపారుల వేడుకోలు

Lock Down

Delhi CM : ప్లీజ్.. లాక్ డౌన్ ఎత్తేయండి..ఇప్పటికే లాస్ లో ఉన్నాం..మళ్లీ విధించిన లాక్ డౌన్ తో కుదేలవుతున్నాం..అంటూ..ఢిల్లీ వ్యాపారులు అంటూ అక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ లాక్ డౌన్ విధించారు. దశల వారీగా..లాక్ డౌన్ పొడిగిస్తూ..వస్తున్నారు.

ప్రస్తుతం ఢిల్లీ కోలుకొంటోంది. ఈ క్రమంలో…సంపూర్ణ లాక్‌డౌన్ ను ఎత్తివేయాలని నేషనల్ ఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ (ఎన్డీటీఏ) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కోరుతూ లేఖ రాసింది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో..ఢిల్లీలో ఈ నెల 10 వరకు లాక్ డౌన్ విధించింది. ఆ తర్వాత 17 వరకు లాక్ డౌన్ ను పొడిగించింది. లాక్ డౌన్ ను కూడా మరిన్ని రోజులు పొడిగించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వర్తక సంఘాలు కేజ్రీకి లేఖ రాశాయి.

నియంత్రణలు అమలు చేస్తూ..ఢిల్లీ మార్కెట్ లను తెరిచే విధంగా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు విధించిన లాక్‌డౌన్ మరోసారి పొడిగించకుండా కఠిన నియంత్రణలతో దశల వారీగా మార్కెట్లను ఓపెన్ చేయాలని తాము కోరుతున్నామని ఎన్డీటీఏ ప్రెసిడెంట్ అతుల్ భార్గవ కోరారు.

షాపులు మూతపడటంతో వ్యాపారులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని… ఈఎంఐలు, జీతాలు, అద్దెలు, ప్రాపర్టీ ట్యాక్సులు, జీఎస్టీ తదితర చెల్లింపులు చాలా కష్టంగా మారాయని చెప్పారు. వర్తక సమాజాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మరి కేజ్రీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

Read More : Mangaluru : కుటుంబంపై కరోనా పంజా..11 మంది సేఫ్