TR of Political Parties: రాజకీయ పార్టీల ఆదాయపు పన్ను వివరాలు చెప్పలేం!

ఆర్టీఐ చట్టం కింద రాజకీయ పార్టీల పన్ను రాబడి గురించి అడిగిన ప్రశ్నకు ఐటిశాఖ తమ దగ్గర దానికి సంబంధించిన సమాచారం లేదని సదరు ఆర్టీఐ కార్యకర్తకు వెల్లడించింది.

TR of Political Parties: రాజకీయ పార్టీల ఆదాయపు పన్ను వివరాలు చెప్పలేం!

Itr

RTI activist: ఆర్టీఐ చట్టం కింద రాజకీయ పార్టీల పన్ను రాబడి గురించి అడిగిన ప్రశ్నకు ఐటిశాఖ తమ దగ్గర దానికి సంబంధించిన సమాచారం లేదని సదరు ఆర్టీఐ కార్యకర్తకు వెల్లడించింది. ఐటీ డిపార్టుమెంటు వద్ద సమాచారం లేదంటూ, మినహాయింపు నిబంధనను పేర్కొంటూ సమాచారాన్ని వెల్లడించడానికి నిరాకరించింది. రాజకీయ పార్టీల పన్ను రిటర్నులను పారదర్శకత చట్టం ప్రకారం వెల్లడించాలని కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) 2008లో ఆదేశించింది.

ఈ క్రమంలోనే గత పదేళ్లలో రాజకీయ పార్టీలు దాఖలు చేసిన పన్ను రిటర్నులకు సంబంధించిన సమాచారం కోరుతూ ఆర్టీఐ కార్యకర్త వెంకటేష్ నాయక్ ఆదాయపు పన్ను శాఖకు అర్జీ పెట్టుకున్నారు. దీనికి సమాధానంగా.. “దరఖాస్తుదారుడు అభ్యర్థించిన సమాచారాన్ని సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(సిపిఐఓ) రిజిస్టర్డ్ సమాచారంగా ఉంచలేదని, ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం ఈ సమాచారాన్ని బహిర్గతం చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది.

సుప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రస్తావిస్తూ, ఐటి విభాగం సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మాట్లాడుతూ, కోరిన సమాచారం ప్రజా అధికారం రికార్డులో భాగం కాదని మరియు ఏ చట్టం లేదా నిబంధనల ప్రకారం ఈ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.

అత్యున్నత న్యాయస్థానం మరొక ఉత్తర్వును ఉటంకిస్తూ, సంబంధిత సమాచారం వ్యక్తిగత సమాచారం మరియు ఆర్టీఐ చట్టం ప్రకారం బహిర్గతం చేయక్కర్లేదని చెప్పారు.