రైల్వే శాఖ : ఆ ఉద్యోగాలకు మహిళలు పనికిరారు..

ఢిల్లీ : రైల్వే శాఖలోని కొన్ని ఉద్యోగాలకు మహిళలకు పనికిరారని రైల్వే శాఖ పేర్కొంది. దీనికి సంబంధించి రైల్వే శాఖ ట్రైనింగ్ డిపార్ట్ మెంట్ కు లేఖ రాసింది. రైల్వేలోని కొన్ని విభాగాలైన డ్రైవర్లు, పోర్టర్లు, గార్డు, ట్రాక్ (ఉ)మెన్ వంటి పోస్టుల్లో వర్క్ చాలా కష్టమనీ..అటువంటి పోస్టులకు మహిళలను తీసుకోవద్దని ఉన్నతాధికారులు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి లేఖ రాశారు.
ఒక రైల్లో ఇద్దరు డ్రైవర్‌లు ఉండగా..గార్డులు మాత్రం చివరి బోగిలో ఉంటారు. ఇకపోతే పోర్టర్స్ స్టేషన్లలో బరువైన లగేజీలు మోయటం..ఎత్తాల్సి ఉండగా..రైల్వే ట్రాక్స్ చెక్ చేసేందుకు అర్థరాత్రి సమయాల్లో కూడా (అవసరాన్ని బట్టి) ఒంటరిగానే వెళ్లాల్సి ఉంటుంది. ఇటువంటి సమయాల్లో మహిళలకు ప్రమాదాలు ఎదురవుతాయనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నాం తప్ప మహిళల పట్ల తమకు ఎటువంటి వ్యతిరేకత లేదని..వారి భద్రత దృష్ట్యా మాత్రమే ఈ సూచన చేస్తున్నామని రైల్వే శాఖ ట్రైనింగ్ డిపార్ట్ మెంట్ లేఖలో పేర్కొంది.
ఈ విషయంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రయినింగ్ విభాగం ఇంతవరకూ స్పందించకపోవటం గమనార్హం. ఈ క్రమంలో రైల్వే ఉద్యోగుల యూనియన్ మాత్రం ఈ విషయాలను ఖండించింది. మహిళలను తీసుకోకుండా ఉండేకంటే వారికి కావాల్సిన సెక్యూరిటీ ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుందని యూనియన్ మెంబర్స్ అభిప్రాయపడుతున్నారు. రైల్వేల్లో మహిళలకు మినిమమ్ ఫెసిలిటీస్ కల్పించలేక సెక్యూరిటీ పేరుతో మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు రైల్వేశాఖ సాకుగా చెబుతోందని రైల్వే యూనియన్ విమర్శించింది. ఈ క్రమంలో ఇప్పటి వరకూ స్పందించని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రయినింగ్ ఎలా స్పందించనుందో వేచి చూడాలి.