Virat Kohli : కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ లీటర్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

విరాట్ కోహ్లీ ఆహారం విషయంలోనే కాకుండా తాగే నీటి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తారు. కోహ్లీ.. మినరల్ వాటర్ కు బదులు బ్లాక్ వాటర్ ను తాగుతారట. ఆ వాటర్ లీటర్ ధర తెలిస్తే షాక్ అవుతారు.

10TV Telugu News

Virat Kohli black water : టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. డైట్ విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఆహారం విషయంలోనే కాకుండా తాగే నీటి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తారు. కోహ్లీ.. మినరల్ వాటర్ కు బదులు బ్లాక్ వాటర్ ను తాగుతారట.

అయతే బ్లాక్ వాటర్ లీటర్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే మినరల్ వాటర్ లీటర్ ధర రూ.20 నుంచి 40 వరకు ఉండగా.. బ్లాక్ వాటర్ లీటర్ ధర రూ.3000 నుంచి 4000 వరకు ఉంటుందట. ఈ బ్లాక్ వాటర్ ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతుంది.

కరోనా వైరస్ ప్రారంభం నుంచి కోహ్లీ బ్లాక్ వాటర్ తాగడం ప్రారంభించాడు. కేవలం కోహ్లీ మాత్రమే కాదు, బాలీవుడ్ హీరోయిన్స్ ఊర్వశి రౌటేలా, మలైకా అరోడా, దక్షిణాది హీరోయిన్ శ్రుతిహాసన్ ఫిట్ గా ఉండేందుకు బ్లాక్ వాటర్ నే తాగుతున్నారు.

అసలు బ్లాక్ వాటర్ అంటే ఏమిటీ? దాన్నివల్ల లాభాలేంటో ఒకసారి చూద్దాం.. బ్లాక్ వాటర్ లో సహజసిద్ధమైన ఆల్కలైన్ ఉంటుంది. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్, ఫిట్ గా ఉండేలా చేస్తుంది. దీంతో వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు. ఇందులో ఉండే 70 శాతం ఖనిజాలు జీర్ణప్రక్రియ, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

మనం తాగే నీటిలో pH స్థాయి 7 మాత్రమే ఉంటే..బ్లాక్ వాటర్ లో 7 కంటే ఎక్కువ ఉండటం గమనార్హం. అందుకే ఇందులో యాంటీ ఏజెంట్ గుణాలు ఉంటాయి. చర్మం యవ్వనంగా ఉండేందుకు తోడ్పడుతుంది. గుజరాత్ లోని వడోదరలోని ఏవీ ఆర్గానిక్స్ అనే అంకుర సంస్థ ఎవోకస్ పేరుతో బ్లాక్ వాటర్ ను తయారు చేస్తోంది.