Mobile Use: దేశంలో ఏ రాష్ట్రంలో ఫోన్లు ఎక్కువ వినియోగిస్తున్నారో తెలుసా? ఆర్‌బీఐ గణాంకాలు ఏం చెప్పాయంటే..

ఆర్‌బీఐ నివేదిక ప్రకారం.. 2022 మార్చి నాటికి దేశంలో ప్రతి వంద మంది జనాభాకు ల్యాండ్ ఫోన్లు, సెల్ ఫోన్లు, ఇతర ఫోన్లు అన్నీ కలిపి 84.87 ఉన్నట్లు తేల్చింది. బీహార్ రాష్ట్రంలో వంద మందికి కేవలం 52.87 ఫోన్లు మాత్రమే వాడుతున్నారని తాజా నివేదిక ద్వారా వెల్లడైంది.

Mobile Use: దేశంలో ఏ రాష్ట్రంలో ఫోన్లు ఎక్కువ వినియోగిస్తున్నారో తెలుసా? ఆర్‌బీఐ గణాంకాలు ఏం చెప్పాయంటే..

Mobile Phone

Mobile Use: ఫోన్.. ఇప్పుడు దాదాపు అందరి జీవితంలో ఇది భాగస్వామిగా మారిపోయింది. ముఖ్యంగా నేటితరం యువత ఫోన్ లేకుంటే జీవనం కష్టంగాభావిస్తున్నారు. ఎటువెళ్లినా ఫోన్ జేబులో ఉండాల్సిందే. ఈ క్రమంలో దేశంలోనూ ఫోన్ల వినియోగం నానాటికి పెరుగుతూ వస్తోంది. అయితే, తాజాగా ఆర్‌బీఐ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దేశంలో ఏ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఫోన్లు వినియోగిస్తున్నారో అంచనా వేసింది.

Mobile Users : మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్, సిమ్ మార్చకుండానే మారిపోవచ్చు

ఆర్‌బీఐ నివేదిక ప్రకారం.. 2022 మార్చి నాటికి దేశంలో ప్రతి వంద మంది జనాభాకు ల్యాండ్ ఫోన్లు, సెల్ ఫోన్లు, ఇతర ఫోన్లు అన్నీ కలిపి 84.87 ఉన్నట్లు తేల్చింది. ఫోన్ల వినియోగంలో దేశంలోనే ఢిల్లీ అగ్రస్థానంలో ఉందని, అక్కడ ప్రతీ వందమందికి 267.63 ఫోన్లు వినియోగిస్తున్నట్లు ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తరువాతి స్థానంలో కోల్ కత్తా నిలిచింది. ఇక్కడ ప్రతీ వంద మంది జనాభాలో 143.38 ఫోన్లు వినియోగిస్తుండటం గమనార్హం. ముంబైలో 139.95, హిమాచల్ ప్రదేశ్ లో 138.44 చొప్పున ఫోన్లు వినియోగంలో ఉన్నట్లు నివేదిక అంచనా వేసింది.

Mobile Phone Users : భారత్‌లో 1.2 బిలియన్లకుపైనే మొబైల్ ఫోన్ యూజర్లు.. నివేదికలో వెల్లడి!

ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. దేశంలో అతితక్కువగా ఫోన్లు వినియోగిస్తున్న రాష్ట్రంగా బీహార్ నిలిచింది. ఆ రాష్ట్రంలో వంద మందికి 52.87 ఫోన్లు మాత్రమే వాడుతున్నారు. ఇక ఏపీలో ప్రతీ వంద మందికి93.63 ఫోన్లు ఉన్నట్లు ఆర్‌బీఐ తన నివేదికలో వెల్లడించింది.