షాకింగ్ : పేషెంట్ ను MRI మెషీన్ కు కట్టేసి వెళ్లిపోయిన డాక్టర్

  • Published By: venkaiahnaidu ,Published On : September 23, 2019 / 10:45 AM IST
షాకింగ్ : పేషెంట్ ను MRI మెషీన్ కు కట్టేసి వెళ్లిపోయిన డాక్టర్

వైద్య నిర్లక్ష్యంగా కారణంగా ఓ వ్యక్తి చావు అంచుల దాకా వెళ్లివచ్చాడు. MRI స్కానింగ్ మెషీన్ లో వృద్ధ రోగిని ఉంచి మర్చిపోయి డాక్టర్ వెళ్లిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని పంచకుల సెక్టార్ -6 లోని ఎంఆర్‌ఐ-స్కాన్ సెంటర్‌లో ఈ సంఘటన అందరినీ షాక్ కు గురిచేసింది.

ఆదివారం(సెప్టెంబర్-22,2019)సాయంత్రం వైద్య పరీక్షల కోసం రామ్ మెహర్(61)అనే వృద్ధ రోగి పంచకుల సెక్టార్ -6 లోని ఎంఆర్‌ఐ-స్కాన్ సెంటర్‌ కు వెళ్లాడు. స్కానింగ్ కోసమని టెక్నీషియన్ ఆ వృద్ధుడిని MRI మెషీన్ లో ఉంచాడు. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. 

అయితే తనను ఎప్పుడూ బయటకు తీస్తారా అని  రామ్ టెక్నీషియన్ కోసం ఎదరుచూస్తూనే ఉన్నాడు. ఎంతసేపు ఎదురుచూసినా కూడా అక్కడికి ఎవ్వరూ రాలేదు. ఇంతలో ఆతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. లోపల గాలి ఆడకపోవడంతో MRI మెషీన్ నుంచి బయటకు వచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే మెషీన్ లోపల ఆయన ఓ బెల్ట్ తో కట్టివేయబడి ఉండటంతో ఎంత ప్రయత్నించినా బయటలకు రాలేకపోయాడు. ఇలా చాలా సేపు ప్రయత్నించిన ఆయన చివరకు ఎలాగోలా బెల్ట్ ను బ్రేక్ చేసి మెషీన్ నుంచి బయటకి రాగలిగాడు. అయితే తనను మెషీన్ లో ఉంచి మర్చిపోయి వెళ్లిన స్కానింగ్ సెంటర్ సిబ్బందిపై ఆయన కేసు పెట్టాడు. తను ఎలాగోలా తనకు తానుగా బయటకి రాకుంటే చనిపోయి ఉండేవాడినని రామ్ తన కంప్లెయింట్ లో తెలిపాడు. ఇదే విషయమై హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజి,డీజీ(హెల్త్)డాక్టర్ సూరజ్ భాన్ కూడా కంప్లెయింట్ ఫైల్ చేశారు.

అదే సమయంలో…..వృద్ధుడిని మెషీన్ నుండి బయటకు తీసుకురావడానికి టెక్నీషియన్ సహాయం చేశారని ఎంఆర్ఐ సెంటర్ ఇన్‌చార్జి అమిత్ ఖోఖర్ తెలిపారు. ఈ మొత్తం విషయంలో టెక్నీషియన్ తప్పు లేదని చెప్పారు. రోగికి 20 నిమిషాల స్కాన్ ఉందని, చివరి మూడు నిమిషాల క్రమం ఉందని ఆయన చెప్పారు. చివరి 2 నిమిషాల సెషన్లో రోగి భయపడి వణుకటం ప్రారంభించాడని తెలిపారు. ఒక నిమిషం మిగిలి ఉన్నప్పుడు టెక్నీషియన్ మరొక సిస్టమ్ పై నోట్స్ తయారుచేస్తున్నాడని,ఇంతలో రోగి సగం బయటకు రావడాన్ని టెక్నీషియన్ చూశాడని అన్నారు. టెక్నీషియన్ రోగిని బయటకు తీసుకువచ్చాడని తెలిపారు. అయితే పోలీసులు సిసిటివి ఫుటేజీని తనిఖీ చేసి మొత్తం విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.